చకచకా కనకదుర్గమ్మ వారధి పనులు

త్వరగా పూర్తి చేసేలా చర్యలు

విజయవాడ,జనవరి25(జ‌నంసాక్షి): విజయవాడ కనకదుర్గ గుడి వద్ద నిర్మిస్తున్న ఫ్లై ఓర్‌ పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు. దుర్గా ఫ్లై ఓవర్‌ పనులు పూర్తి చేసేందుకు ఇప్పటికే గడువు పెంచారు. ఫిబ్రవరిలోగా దీనిని అందుబాటులోకి తీసుకుని రావాలని చూస్తున్నారు. ఇంజనీరింగ్‌ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించిన తర్వాత ప్రారంభానికి అనుమతి ఇస్తారు. ప్రకాశం బ్యారేజీ నుంచి కనకదుర్గ వారధి వరకు కృష్ణానది వెంట రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు పనుల్లో భాగంగా ముందుగా ఘాట్ల నిర్మించారు. మిగిలిన దశల్లో అనేక పనులు నిర్వహించాల్సి ఉంది. ఈ ప్రాంతంలో యూటీ పరిధిలోకి వచ్చే ప్రాంతం అనేక అవసరాలకు ఉపయోగపడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని అందరూ ఈ ప్రాంతాన్ని ఉపయోగించు కోవటానికి వీలుగా, ఘాట్లకు వెళ్ళేవారికి ఇబ్బంది కలగకుండా ఉండటానికి అప్రోచలను శ్లాబ్‌ విధానంలో వేయాలని సీఎం సూచించారు. డిజైన్లను మార్చటం వల్ల కొంత అంచనా వ్యయం పెరిగే అవకాశం ఉంది. దుర్గా ఫ్లై ఓవర్‌ అనుసంధాన యూటీ పనుల డిజైన్ల మార్పునకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రానికి నివేదించింది. యూటీకి రెండు వైపులా అప్రోచ పనులను గోడకట్టి మట్టితో నింపే బదులు స్లాబ్‌ విధానం విషయమై డిజైన్ల మార్పునకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవలి కాలంలో దుర్గా ఫ్లై ఓవర్‌ , నాలుగు లేన్ల రోడ్ల విస్తరణకు సంబంధించి ఆయన సవిూక్షించారు. యూటీ పనులు పూర్తయిన నేపథ్యంలో అప్రోచ్‌ పనులకు స్టేట్‌ హైవేస్‌ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. యూటీకి రెండువైపులా అప్రోచ్‌ పనులు చేపట్టాల్సి ఉంది. అప్రోచలకు ముందుగా వాల్స్‌ను సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మట్టిని పోసి వైబ్రేషన ఇచ్చిన తర్వాత హాట్‌మిక్స్‌, వెట్‌మిక్స్‌ వేసిన తర్వాత బీటీ వేయాల్సి ఉంటుంది.కృష్ణలంక జాతీయ రహదారిపై అండర్‌ టన్నెల్‌ పనులు పూర్తయ్యాయి. యూటీకి అనుబంధంగా కింద వాల్‌నిర్మాణ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ వాల్‌ నిర్మాణ పనులు పూర్తి చేయాలంటే ట్రాఫిక్‌ లేకుండా ఉండాలి. ట్రాఫిక్‌ లేకుండా చేయాలంటే అప్రోచ పనులను పూర్తిచేయాల్సి ఉంది. ఇప్పటికే అప్రోచ పనులను చేపట్టారు. త్వరలో అప్రోచ పనులు పూర్తి చేసి రాకపోకలకు అనుమతించనున్నారు. పైన రాకపోకలు సాగుతున్న సందర్భంలో కింద యూటీ మార్గంలో వాల్‌ నిర్మాణం చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తారు. వచ్చే నెలాఖరు నాటికి మిగిలిన నిర్మాణం పూర్తి కానుంది.