చట్టానికి ప్రభుత్వమే తూట్లు పొడుస్తోంది: కోదండరాం
హైదరాబాద్,. తెలంగాణ మార్చ్ కోసం ప్రభుత్వమే అనుమతిచ్చి, మరోవైపు తెలంగాణ నేతలు, కార్యకర్తలు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తోందని రాజకీయ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కవాతుకు అనుమతి ఇచ్చి ప్రభుత్వమే తూట్లు పొడుస్తోందన్నారు.
తెలంగాణ జిల్లాల్లో రాత్రి నుంచి విధ్యుత్‌ను కట్ చేశారని కోదండరాం ఆరోపిచారు. ప్రజాస్వామ్యయుతంగా కవాతు నిర్వహిస్తామని, తాము ఏడు గంటల వరకు కూర్చుంటామని చెప్పలేదని, ఓపిక ఉన్నంత వరకు కవాతు నిర్వహిస్తామన్నారు. జెఏసి కార్యాచరణను సాయంత్రం ప్రకటిస్తామన్నారు.
గౌరవం లేని స్థానానికి తెలంగాణ మంత్రులు రాజీనామా చేసి వెంటనే ప్రజల్లోకి రావాలని కోదండరాం సూచించారు. కవాతుకు ప్రజలు రాకుండ బస్సులు, రైళ్లను నిలిపివేశారన్నారు. అడ్డుకుంటే ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. తెలంగాణవాదుల అరెస్టుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, ప్రజా గాయకుడు గద్దర్,బీజేపీ పార్టీ,తెలంగాణ ప్రాంత ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా అసెంబ్లీ, సచివాలయాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ట్యాక్ బండ్‌వైపుకు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ వద్ద ఎమ్మెల్యేలకు మినహా ఎవరికీ అనుమతించకుండా ఆంక్షలు పెట్టారు.



