చట్టాలు రాజకీయ పార్టీలకు వర్తించవా ?
ఇడి ఉనికినే ప్రశ్నించడం దారుణం
సుప్రీం తీర్పుతో మరింత బలంగా మారిని ఇడి
న్యూఢల్లీి,జూలై28(జనంసాక్షి ): చట్టాల గురించి తెలిసిన నేతలే దాన్ని ఉల్లంఘిస్తున్నారు. చట్టాలు చేసిన పాలకులే నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇడి అధికారాలపై ప్రశ్నించిన కార్తీ చిదంబరం, మహబూబా ముఫ్తీలు సుప్రీం ముందు బొక్కబోర్లా పడ్డారు. ఇది వారికే కాదు..చట్టాలను ప్రశ్నిస్తున్న వారికి గుణపాఠం కావాలి.
మనీలాండరింగ్ కేసుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులకు విస్తృతమైన అధికారాలున్నాయంటూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు నేతలకు చెంపపెట్టు.విచారణ, అరెస్టులు, ఆస్తుల స్వాధీనం తదితర
విషయాల్లో ఈడీ అధికారులకు అమితమైన అధికారాలున్నాయి. అయితే దీనిని వారు సవాల్ చేసి ఇడి అధికారాలను మరింత బలంగా ప్రజలకు తెలయిచేశారు. ఈ విషయంలో సుప్రీం చేసిన వ్యాఖ్యలు నేతలకు కనువిప్పు కావాలి. మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని కొన్ని ప్రావిజన్ల విూద అభ్యంతరం వ్యక్తంచేస్తూ దాఖలైన పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. సోదాలనుంచి ఆస్తుల స్వాధీనం వరకూ ఈడీ అధికారులు ఏమైనా చేయవచ్చునని చెప్పడం, అరెస్టులకు కారణం చెప్పనక్కరలేదని అనడం, బెయిల్ షరతులను ఎత్తిపట్టడం వంటివి ఈడీ భవిష్యత్తు చర్యలను తీవ్రంగా ప్రభావితం చేసే అంశాలుగా చూడాలి. ఈ తీర్పుతో
ఇకముందు ఇడి మరింతగా కోరలు సాచనుంది. ఈ చట్టం సక్రమమైదేనని చెప్పడం ద్వారా ఇడిని సుప్రీం మరింత బలోపేతం చేసింది. అలాగే మనీలాండరింగ్‌కు పాల్పడే నేతలకు మెచ్చరిక చేసింది. చట్టంలోని కఠినమైన ప్రావిజన్లను పిటిషనర్లు సవాలు చేశారు. మనీలాండరింగ్ చట్టం కింద ఈడీకి ఉన్న అధికారాలు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ వెలుపల ఉన్నాయనీ, అయితే, ఈడీ అధికారులు పక్రియలో పోలీసుల్లాగానే వ్యవహరిస్తున్నందున దర్యాప్తు సమయంలో సీఆర్పీసీని అనుసరించాలన్నది వాదన. వివిధదశల్లో ప్రాథమిక హక్కులు, నిందితుడి కనీస హక్కులు ఉల్లంఘనకు గురవుతున్నాయో పిటిషనర్లు తెలియచేశారు. అయితే పిటిషనర్ల వాదనలన్నింటినీ సుప్రీంకోర్టు పూర్తిగా కొట్టివేయడం ద్వారా ఇడి విచారణలను ప్రభావితం చేయలేమని చెప్పింది. మరోవైపు దర్యాప్తు సంస్థలను ప్రయోగించి కేందప్రభుత్వం రాజకీయప్రత్యర్థులను వేధిస్తున్నదంటూ విపక్షాలు కొత్త రాష్ట్రపతి ముర్ముకు ఇటీవలే ఓ లేఖ రాశాయి. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియాగాంధీని రోజులతరబడి ఈడీ తిప్పుతున్న నేపథ్యంలో విపక్ష నేతలం తా ఒక్కటికావడాన్ని అధికారపక్షం దివాలా కోరుతనంగా విమర్శిస్తున్నది. విచారణ అన్నదే వద్దన్నరీతిలో కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. తామంతా సానబెట్టిన నిఖార్సయిన నేతలుగా ప్రకటించుకున్నారు. అలా అయితే ఇడి విచారణలో నిజాలు నిగ్గుతేలాలి. ఇంతకాలంఅ ధికారం వెలగబెట్టిన నేతలంతా అనేక ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారు. వారంతా ఇప్పుడు విచారణ అంటే విధించడం అన్నరీతిలో వాదిస్తున్నారు.
ఢల్లీి ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రులు, కాంగ్రెస్, జేడీఎస్ సీనియర్ నాయకులు,ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్ వాదీ నాయకులదీ అదే పరిస్థితి. పశ్చిమబెంగాల్‌లో మమత మేనల్లుడు, కీలకమైన తృణమూల్ మంత్రులను ఈడీ పలుకేసుల్లో ప్రశ్నిస్తున్నది. జమ్మూ కశ్మీర్‌లో అబ్దుల్లా కుటుంబీకులను, మెహబూబా ముఫ్తీనీ ఈడీ ఊపిరి తీసుకోనివ్వడం లేదు. అందుకే వీరంతా జట్టుకట్టి ఇడి ఉనికినే ప్రశ్నించాలనుకున్నారు.అందుకే గత పదేళ్ళలో ఈడీ దాడులు దాదాపు ముప్పైరెట్లు పెరిగాయి. సుప్రీం తీర్పుతో అనేక కేసుల్లో ఉన్న వారికి భయం పట్టుకుంది.