చట్టాల రద్దు ప్రక్రియ ముగిస్తేనే ఆందోళన రద్దు
అప్పటి వరకు ఢల్లీి సరిహద్దులు వదిలేది లేదు
త్వరలోనే కార్యాచరణ చేస్తామన్న రైతు సంఘాలు
న్యూఢల్లీి,నవంబర్19(జనం సాక్షి ): మూడు వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించు కుంటున్నట్లు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించినా, రైతులు మాత్రం నిరసన కొనసాగిస్తా మంటున్నారు. సింఘు సరిహద్దుల్లో నిరసన కార్యక్రమాలు చేస్తున్న రైతులు తిరిగి ఇళ్లకు వెళ్లాలని ప్రధాని కోరారు. అయితే ఢల్లీికి సవిూపంలోని సింఘు సరిహద్దులో క్యాంప్ చేస్తున్న రైతులు మాత్రం దీనిపై చట్టం చేశాకే తిరిగి ఇళ్లకు వెళతామంటున్నారు. పార్లమెంటులో చట్టాలను రద్దు చేసే పక్రియ ప్రారంభమైన తర్వాత మాత్రమే తాము నిరసన స్థలం నుంచి బయలుదేరుతామని రైతులు ముక్తకంఠంతో చెప్పారు. కేంద్రం గత ఏడాది సెప్టెంబరులో తీసుకువచ్చిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఏడాది కాలంగా ఆందోళనలు చేశారు. దీంతో దిగివచ్చిన కేంద్రం మూడు వివాదాస్పద చట్టాలను ఎట్టకేలకు రద్దు చేయనుంది. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ ప్రధాని మోడీ ప్రకటించడంపై సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) హర్షం వ్యక్తం చేసింది. పార్లమెంట్‌లో దీనికి సంబంధించి ప్రకటించేంత వరకు ఎదురుచూస్తామని తెలిపింది. ఇదే జరిగితే ఏడాది కాలంగా చట్టాలను రద్దు చేయాలని దేశ సరిహద్దుల్లో ఆందోళనలు చేపడుతున్న రైతుల విజయం గా భావించవచ్చు. ఈ సందర్భంగా ఎస్‌కెఎం ఓ ప్రకటన చేసింది. ఈ పోరాటంలో సుమారు 700 మంది రైతులు మరణించారని పేర్కొంది. కేంద్రం మొండి వైఖరి కారణంగా లఖింపూర్ ఖేరీ హత్యలతోపాటు ఈ పోరాటంలో అనేక మంది రైతులు అసుశువులు బాసారని తెలిపింది. ఈ మూడు చట్టాలు రద్దుతోనే ఈ పోరాటం ఆగిపోదని పేర్కొంది. వ్యవసాయానికి సంబంధించిన అన్ని ఉత్పత్తులకు, ప్రతి రైతుకు లాభదాయకమైన ధరలకు చట్టబద్ధమైన హావిూని కల్పించాలని తెలిపింది. ఈ డిమాండ్ ఇంకా పెండిరగ్‌లో ఉందని గుర్తు చేసింది. విద్యుత్ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ప్రస్తుత పరిణామాలను ఎస్‌కెఎం పరిశీలించి.. త్వరలో సమావేశం నిర్వహించి.. తదుపరి కార్యాచరణను వెల్లడిస్తామని తెలిపింది.