చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేసిన – ఎమ్మెల్యే కందాళ.
కూసుమంచి ఆగస్టు 11 ( జనం సాక్షి ) : మండలంలోని జక్కేపల్లి గ్రామంలో ఇటీవల మరణించిన సీనియర్ నాయకులు సోమిరెడ్డి నరసింహారెడ్డి, కొత్త మల్లమ్మ చిత్రపటాలకు పూలమాల నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట జక్కేపల్లి సహకార సంఘం చైర్మన్ నలబోలు చంద్రారెడ్డి, తెరాస మాజీ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాయబరపు రమేష్ స్థానిక తెరాస నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.