చలో హందూపురం పిలుపుతో ఉద్రిక్తత

అనంతపురం,నవంబర్‌27(జ‌నంసాక్షి): హిందూపురంలో ఉద్రిక్తత నెలకొంది. క్షణక్షణం ఉత్కంటగా కొనసాగుతోంది. 279 జిఒ ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ .. అనంతపురం జిల్లాలోని మున్సిపల్‌ కార్మికులు మంగళవారం హిందూపురంలో ‘ చలో ‘ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతపురంలోని మున్సిపల్‌ కార్యాలయం ముట్టడికి కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. కదం తొక్కిన కార్మికుల ఉద్యమాన్ని అడ్డుకోవడానికి పోలీసులు భారీ బలగాలను దించారు. ముందస్తుగా.. పోలీసులు జిల్లా నలుమూలల నుండి వస్తున్న కార్మిక నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్‌ చేశారు. ముఖ్య నేతలను సోమవారం రాత్రే గృహ నిర్బంధం చేశారు. కొందరిని నిన్న రాత్రే పోలీస్‌ స్టేషన్‌లకు తరలించారు. ‘ చలో ‘ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఇతర పురపాలక సంఘాల నుంచి మున్సిపల్‌ కార్మికులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశాలు ఉన్నందున వారిని అడ్డుకునేందుకు ముందుగానే స్థానిక రైల్వే స్టేషన్లో పోలీసులు మోహరించారు. కార్మికుల ఉద్యమాన్ని అడ్డుకుంటున్న ఖాకీలు.. మరో వైపు అధికారులకు భారీ బందోస్తు ఏర్పాటు చేశాయి. స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకఅష్ణ, మున్సిపల్‌ కార్యాలయం మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ ఇంటి వద్ద భారీ పోలీసుల బందోబస్తును ఏర్పాటు చేశారు.