చాకలి ఐలమ్మ గొప్ప పోరాట యోధురాలని ఆమె ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలి.

-జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి. గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 26 జనం సాక్షి.
చాకలి ఐలమ్మ 128 వ జయంతిని పురస్కరించుకొని వీరనారి చాకలి ఐలమ్మ గొప్ప పోరాట యోధురాలు అని ఆమె ఆశయాలను ప్రతి ఒక్కరు స్పూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.
మంగళవారం జిల్లా కలెక్టరేట్ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వీరనారి చాకలి ఐలమ్మ 128 వ జయంతి ఉత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి చాకలి ఐలమ్మ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ ఉద్యమంలో వీరనారి చాకలి ఐలమ్మ ముఖ్య భూమిక పోషించారని , తెలంగాణ పౌరుషాన్ని, పోరాటాన్ని, త్యాగాన్ని భావి తరాలకు అందించి ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన గొప్ప పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని కొనియాడారు. వీర నారీ చాకలి ఐలమ్మ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం అధికారికంగా జరపడం సంతోషాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కల్లెక్టర్ లు అపుర్వ్ చౌహాన్, చీర్ల శ్రీనివాస్, బి సి సంక్షేమ అధికారి శ్వేత ప్రియదర్శిని,ఏ ఓ బద్రప్ప, జిల్లా అధికారులు, జయశ్రీ, నర్సింహులు, అశోక్ , కోట్ల వీరేష్, జి.నాగరాజు, శ్రీరాములు , నరసింహులు, ములకల పల్లి నరసింహులు తదితరులు పాల్గొన్నారు.