చింతా ప్రభాకర్ అధ్వర్యంలో యువతీ యువకులకు ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్
డ్రైవింగ్ లైసెన్స్ లబ్ధిదారుల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
సంగారెడ్డి బ్యూరో , జనం సాక్షి , జూలై 19 ::చింతా ప్రభాకర్ అధ్వర్యంలో యువతీ యువకులకు ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ అందజేసే కార్యక్రమం బుధవారం ఆయన క్యాంపు కార్యాలయం లోడ్రైవింగ్ లైసెన్స్ లబ్ధిదారుల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అయ్యింది.18 సంవత్సరాలు నుండి డ్రైవింగ్ లైసెన్సులు లేకుండా ఉన్న యువతీ యువకులు క్యాంప్ కార్యాలయం క్రిక్కిరిసిపోయారు.ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ నాయకులు బుచ్చిరెడ్డి, విజయేందర్ రెడ్డి, నరహరి రెడ్డి, ప్రభు గౌడ్ మాట్లాడుతూ చింతా ప్రభాకర్ ఎంతో సౌదయంతో సంగారెడ్డి నియోజకవర్గంలో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ లేని యువతి యువకులకు తన సొంత నిధులతో డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే కార్యక్రమం పూనుకోవడం హర్షనీయమన్నారు.నియోజకవర్గంలో నీ యువతి యువకులు ఎవరు కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండ్లు నడపరాదని లైసెన్సు ఉండడంవల్ల వారికి ఎంతో మేలు చేకూరుస్తుందని సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు.లైసెన్స్ లేకుండా బండ్లు నడపడం వల్ల చలాన్లు కట్టడం జరుగుతుందని, అంతేకాకుండా అనేక అనర్థాలకు లోనవుతున్నారని ఆలోచించి తాను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని వారు తెలిపారు.ఈ సందర్భంగా ఉచింతా డ్రైవింగ్ లైసెన్స్ ఆలోచనలపై చింతా ప్రభాకర్ కు లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేసి, ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో చింతా సాయి నాథ్, సి.డి.సి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి, మాజీ సిడిసి చైర్మన్ విజేందర్ రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభూ గౌడ్,పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు ,మాజీ జెడ్పీటీసీ మనోహర్ గౌడ్,నాగరాజ్ గౌడ్, డా.శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.