చికిత్స పోందుతూ మహిళ మృతి

కోహెడ : మండలం రాంచంద్రాపూర్‌ గ్రామానికి చెందిన కోమిర రమాదేవి (29) ఈ నెల 16న పురుగుమందు తాగి అత్మహత్యయత్నానికి పాల్పడింది. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో అమెని కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అసుపత్రిలో చికిత్సపోందుతూ అమె శనివారం రాత్రి మృతిచెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమెదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.