చినగంజాంలో రోడ్డు ప్రమాదం
ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలు
ఒంగోలు,ఆగస్ట్30(జనం సాక్షి): ప్రకాశం జిల్లా చినగంజాం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో ఓ టెంపో వాహనం జాతీయ రహదారిపై వెళ్తున్న లారీని వెనుకనుంచి ఢొకొట్టింది. నెల్లూరులో రాత్రి జరిగిన వివాహ రిసెప్షన్ వేడుక ముగించుకొని చీరాల వైపు టెంపో వాహనంలో వెళ్తున్న 12 మందిలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో చీరాలలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం క్షతగాత్రుల వివరాలను వెల్లడించారు. టెంపోలో ప్రయాణిస్తున్న 12 మందిలో తొమ్మిది మంది చీరాలకు చెందినవారు కాగా మిగతా వారంతా గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందినవారిగా గుర్తించారు.