చిన్నారులను వేధిస్తే జైలే : నార్వే చైల్డ్‌ వెల్ఫేర్‌ సర్వీస్‌

నార్వే : చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఓ చైల్డ్‌ వెల్ఫేర్‌ సర్వీసెస్‌ను ఏర్పాటు చేసిన తొలిదేశం నార్వే. అంతేకాదు పిల్లల కోసం ప్రత్యేకంగా అంబుడ్స్‌మెన్‌ను నియమించిన మొట్టమొదటి దేశం కూడానార్వేనే. ఈ దేశాన్ని చూసి మరో 70 దేశాలు పిల్లల కోసం అంబుడ్స్‌మెన్స్‌ను ఏర్పాటు చేశాయి. నార్వే చైల్డ్‌ వెల్ఫేర్‌ సర్వీస్‌ అంటే చిన్నారుల కోసం ఏర్పాటు ప్రత్యేక పోలీసు వ్యవస్థ. క్రమశిక్షణాయుత పెంపకంలో భాగంగా పిల్లల పట్ల దురుసుగా ప్రవర్తించిన వారిపై ఒత్తిడి చేసినా పెంపకంలో ఏ మాత్రం దురుసుగా ప్రవర్తించినా ఈ వెల్ఫేర్‌ సర్వీస్‌ సిబ్బంది రంగంలోకి దిగి పిల్లలను ఎలాంటి ఒత్తిడులకు లోనుకాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని సలహా ఇస్తారు. ప్రస్తుతం నార్వేలో నివసిస్తున్న తెలుగు దంపతుల విషయంలోనూ ఇదే జరిగింది. యాక్టివ్‌గా ఉన్న తమ కుమారుడిని మందలించారంటూ ఇప్పుడు చంద్రశేఖర్‌-అనుపమ దంపతులను ఏకంగా అరెస్టు చేశారు. నార్వే నిబంధనలపై భారత్‌లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు, నిరసనల గళం వినిపిస్తున్నాయి. అయినప్పటికీ నార్వే మాత్రం పట్టించుకోవడం లేదు.