చిన్నారుల కోసం గూగుల్‌ సైన్స్‌ ఫెయిర్‌


888
న్యూదిల్లీ: విద్యార్థుల ఆలోచనలకు పదును పెట్టి.. కొత్త ఆవిష్కరణల దిశగా ప్రయత్నింపజేసేందుకు ప్రముఖ సెర్చ్‌ఇంజన్‌ గూగుల్‌ ఈ ఏటి గ్లోబల్‌ సైన్స్‌ ఫెయిర్‌-2016ను ప్రారంభించింది. 13 నుంచి 18ఏళ్లలోపు పిల్లలకు గూగుల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో పోటీ పెడుతోంది. వ్యక్తిగతంగా లేదా బృందంగా వారు తమ సైన్స్‌ ప్రాజెక్టులను గూగుల్‌కు ఆన్‌లైన్‌ ద్వారా పంపించవచ్చు.

గూగుల్‌ సైన్స్‌ ఫెయిర్‌ అప్లికేషన్స్‌ పంపించడానికి ఆఖరి తేదీ ఈ ఏడాది మే 18. ప్రాంతీయ ఫైనలిస్టులను, కమ్యూనిటీ ఇంపాక్ట్‌ విన్నర్స్‌ని జులై 18న ప్రకటిస్తారు. గ్లోబల్‌ ఫైనలిస్టులను ఆగస్టు 11న వెల్లడిస్తారు. సెప్టెంబరు 9న అవార్డులు ప్రదానం చేయనున్నారు. గూగుల్‌ సైన్స్‌ ఫెయిర్‌ పోటీలో ప్రవేశం ఉచితం.