చుక్కలను తాకిన సన్నబియ్యం ధరలు
మంథని రూరల్ జూన్ 12 (జనంసాక్షి): అన్నాదాత ఆరుగాలం కష్టించి పండించిన వరి ధాన్యం గిట్టుబాటు ధర లభించక అల్లలాడి అప్పు ల పాలైతే అదేధాన్యం దళారుల చేతులు మారి నే డు మార్కేట్లో సన్నబియ్యం ధర చుక్కలకు తాకు తుంది. గత నాల్గుగెళ్లాలో లేని విధంగా ప్రస్తూతం ధర రూ. 3వేలు పలుకుంది. గత నాల్గగెళ్ళా నుం డి రూ. 2200 ఉన్న ధర నేడు రూ. 3000 చేరు కుందంటే సామాన్య ప్రజల జీవితాలపై ఎంత భారం పడుతుందో ప్రభుత్వామే ఆలోచించాలి. చాలిచాలని డబ్బు లతో బతుకు బండి లాగు తున్నారు. నిత్యవసర సరుకుల ధరలతో మార్కేట్లు మండిపోతున్నాయి. గత నెలలో ఉన్న రూ. 233 0 క్వింటాళ్ళ ధర ప్రస్తూతం రూ. 3000 ముక్కి పోయి రంగు మారిన బియ్యం రూ. 1800 నుం డి రూ. 2600లకు పెరిగిందరటే సామాన్యుడిపై ఎంత భారం పడుతుందో గమనించాలి. ఇందనం ధరలు లీటర్‌కు రూ. 7 పెరిగితేనే ప్రతిపక్షా పార్టీ లు, ప్రజలు, వివిధ సంఘాల నాయకులు ధర తగ్గించాలని ధర్నాలు, రాస్తారోకోలు చేస్తు ప్రభు త్వం దిగివచ్చేల చేస్తున్నారు. బియ్యం ధర ఊహకందని విధంగా పెరిగిపోతుంటే ఏ రాజ కీయ నాయకుడైన ప్రజాసంఘాలైన పట్టించు కో వడం లేదని సామాన్య ప్రజలు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. వందలలో ధరలను పెంచుకుంటు పోతు మిల్లర్లు దళారులు లాభాపడుతున్నారే తప్ప సామాన్య ప్రజలు గాని రైతు గాని లాభపడడం లేదని రైతులు, ప్రజలు వాపోతున్నారు. ధరలు విఫరితంగా పెరుగుతున్నాయికాని సామాన్య ప్ర జల అదాయం మాత్రం పెరగడం లేదని మద్య త రగతి ప్రజలు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ఈ వి ధంగా పెరిగె ధరలు ప్రభుత్వ సూచనాల మేరకే పెరుగుతాయా లేక మిల్లర్లు తమ ఇష్టానుసారంగా పెంచుతార అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పెరిగిన ధరలపై ప్రభుత్వం కల్పించుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న మిల్లర్ల చర్యలు తీసుకొని బియ్యం ధరలను సామాన్య ప్రజలకు అందుబాటు ఉండే విధంగా తీసురావలని ప్రజలు కొరుకుంటున్నారు.