చుక్క నీరూ వదులుకోం

` పోలవరం`నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టును పూర్తిగా వ్యతిరేకించాం
` తెలంగాణ నీటి ప్రయోజనాలపై రాజీపడబోం
` హరీష్‌రావు నిజాలు తెలుసుకుని మాట్లాడాలి
` పదేళ్లలో సాగునీటి రంగాన్ని భ్రష్టు పట్టించిన బీఆరఎస్
` మండిపడ్డ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి): కేంద్ర జలసంఘం ఛైర్మన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పోలవరం`నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టు అంశాన్ని అధికారులు పూర్తిగా వ్యతిరేకించినట్టు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. నదీ జలాల్లో తెలంగాణ ప్రయోజనాలు పరిరక్షించేలా అవసరమైన వాదనలను అధికారులు వినిపించారని చెప్పారు. పోలవరం ` బనకచర్ల లేదా నల్లమలసాగర్‌కు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని శుక్రవారం నాటి సమావేశంలో సీడబ్ల్యూసీ ఛైర్మన్ స్పష్టంగా చెప్పారన్న మంత్రి… గతంలో కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ కూడా లిఖితపూర్వకంగా తెలిపారని అన్నారు. పదేళ్ల బీఆరఎస్ హయాంలో తెలంగాణకు నీటి వాటాల్లో నష్టం జరిగిందని ఆరోపిం చారు. కష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణ ప్రభుత్వం చుక్క నీరు కూడా వదులుకోదని.. తెలంగాణ నీటి హక్కుల కోసం సర్వశక్తులు ఒడ్డుతూ పోరాడుతున్నట్లు వివరించారు. నీటి వాటాలపై చర్చలకు తాము సిద్ధమేనని అన్నారు. దిల్లీ సమావేశం గురించి మాజీమంత్రి హరీశ్ రావు తెలుసుకొని మాట్లాడితే బాగుండేదని ఉత్తమ్ సూచించారు. బీఆరఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేవలం 60, 70 టీఎంసీలను మాత్రమే వ్యవసాయానికి ఉపయోగించారని.. రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి లక్ష ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదని విమర్శించారు. నీటిపారుదల రంగాన్ని సర్వనాశనం చేసిన బీఆరఎస్ నేతలు తమను విమర్శించడం విడ్డూరంగా ఉందని ఆక్షేపించారు. ఆదిత్యనాథ్ దాస్ గురించి పదేపదే మాట్లాడడం తగదన్న ఆయన… తెలంగాణ ప్రాజెక్టులపై పూర్తి అవగాహన ఉన్నందుకే ఆదిత్యనాథ్ దాస్‌ను ప్రభుత్వ సలహాదారుగా పెట్టుకున్నట్లు వివరించారు. కేంద్ర జల వివాదాల పరిష్కార కమిటీ సమావేశం దాదాపు రెండు గంటల ఈ భేటీ సాగింది. ఈ అంశంపై తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి 12 అంశాలు చర్చించాలని ప్రతిపాదించామన్నారు. పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టును అజెండాలో పెట్టొద్దని స్పష్టం చేసినట్లు తెలిపారు. రెండు రాష్టాల్ర మధ్య పలు జల వివాదాలు ఉన్నాయి.. కష్ణా, గోదావరి జలాలపై అనేక అంశాలు ఉన్నాయి, అందుకే సమావేశానికి వచ్చామని వెల్లడించారు. ఈ సమావేశంలో ఏపీ తన అజెండాను చెప్పలేదని.. తదుపరి సమావేశం సీడబ్ల్యూసీ నిర్ణయిస్తుందన్నారు. అనంతరం.. ఈ అంశంపై తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. ‘ఒక్క చుక్క నీరు కూడా వదులుకోం. ఢిల్లీలో జరిగిన విÖటింగ్ గురించి హరీష్ రావు తెలుసుకుని మాట్లాడాలి.. మన నది జలాలను కాపాడుకోవడానికి ఎవరితోనైనా చర్చలకు సిద్ధం.. కానీ చుక్క నీరు కూడా వదులుకునేది లేదు.. తెలంగాణ అధికారులు.. నల్లమల సాగర్ ప్రాజెక్టును అజెండాలో పెట్టడానికి ఒప్ప్పుకోమని స్పష్టం చేశారు.. ఇంటర్ స్టేట్ ఇష్యూలు అజెండాలో పెట్టాలని కేంద్రానికి చెప్పారు. పోలవరం.. నల్లమల సాగర్ కి అనుమతి లేదని కేంద్ర మంత్రి నాకు లేఖ రాశారు.. ఇవాళ జరిగిన విÖటింగ్ లో కూడా సీడబ్ల్యూసీ ఇదే చెప్పింది.. పదేళ్లు రాష్టాన్ని అప్ప్పుల పాలు చేసి కట్టిన ప్రాజెక్టు కూలింది.. ఆ నాయకులు సిగ్గుపడాలి.. పదేళ్లలో ఎసఎల్‌బిసి పూర్తి చేయలేదు.. డిండి ప్రాజెక్టు పూర్తి చేయలేదు.. పదే పదే అబద్దాలు చెప్పి? నిజం చేయాలని అనుకుంటున్నారు.. పదేళ్ల లో కంటే ఈ రెండేళ్లలో ఎక్కువ నీటి వినియోగం, వరి దిగుబడి వచ్చిందని ఉత్తమ్ వ్యాఖ్యానించారు.

అజెండా అంశాలు ఖరారయ్యాకే తదుపరి భేటీ
` వారంలోగా ఖరారు చేసి లిఖితపూర్వకంగా ఇవ్వాలని
` ఏపీ,తెలంగాణ రాష్ట్రాలకు సూచించిన సీడబ్ల్యూసీ ఛైర్మన్
` అజెండాలో 12 అంశాలు చేర్చాలని తెలంగాణ ప్రతిపాదన
` అందులో పోలవరం` నల్లమలసాగర్ ప్రాజెక్టును పెట్టొద్దని వినతి
` ట్రైబ్యునల్ తీర్పు వచ్చే వరకు 50 శాతం నీటిని వాడుకునే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి
` ముగిసిన కేంద్ర జలవివాదాల పరిష్కార కమిటీ సమావేశం
న్యూఢిల్లీ(జనంసాక్షి):కేంద్ర జలవివాదాల పరిష్కార కమిటీ సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటలపాటు ఈ భేటీ జరిగింది. అజెండాలో 12 అంశాలు చేర్చాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. పోలవరం, నల్లమలసాగర్ ప్రాజెక్టును అజెండాలో పెట్టవద్దని కోరింది. ట్రైబ్యునల్ తీర్పు వచ్చే వర కు 50 శాతం వాడుకునే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. తెలంగాణ అధికారులు లేవనెత్తిన పలు అంశాలపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. వారంలోగా అజెండా అంశాలు ఖరారు చేసి లిఖితపూర్వకంగా ఇవ్వాలని సీడబ్ల్యూసీ ఛైర్మన్ తెలిపారు. అజెండా అంశాలు ఖరారయ్యాక భేటీ తేదీని ఖరారు చేస్తామని ఛైర్మన్ స్పష్టం చేశారు.