చెన్నారెడ్డినే తరిమాం.. చంద్రబాబు ఎంత?
– విమానాశ్రయ భూ నిర్వాసితులకు పట్టాలు అందజేయాలి
– తమ నిరసన దీక్షను అడ్డుకుంటే తిరగబడతాం
-మాజీ మంత్రి, బీజేపీ నేత మాణిక్యాలరావు
అనంతపురం, సెప్టెంబర్ 28(జనంసాక్షి ) : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై బీజేపీ మాజీ రాష్ట్ర మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిగూడెం విమానాశ్రయ భూముల నిర్వాసితులకు పట్టాలు ఇవ్వడంలో చంద్రబాబు ప్రభుత్వం మాట తప్పిందని మండిపడ్డారు. భూ నిర్వాసితులకు పట్టాలు అందజేయాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులతో కలసి ఆయన నిరసన దీక్ష చేపట్టారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను రెచ్చగొడితే.. తాము తిరగబడతామని హెచ్చరించారు. అవసరమైతే కర్రలు చేపట్టి ప్రభుత్వంపై పోరాడుతామని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డినే తరిమిన ఘనత తమదని.. ఆఫ్టాల్ర్ చంద్రబాబును తరమడం ఎంతపని అని మాణిక్యాలరావు అన్నారు. దమ్ముంటే తమ నిరసన దీక్షను అడ్డుకోవాలని సవాల్ విసిరారు. నిట్ ప్రారంభోత్సవంలో చంద్రబాబు ఇచ్చిన 56హావిూల్లోనూ అతీగతీ లేదన్నారు. చంద్రబాబు కేవలం హావిూ ఇవ్వడం తప్ప వాటి పరిష్కారంలో ఎలాంటి చిత్తశుద్ది చూపడం లేదని విమర్శించారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు. చంద్రబాబు తీరు సరికాదని, ఇచ్చిన హావిూలను నిలబెట్టుకోవాలని మాణిక్యాలరావు సూచించారు. కేంద్రం నిధులిస్తుంటే కేంద్రం సహకరించడం లేదని దుష్పచ్రారం చేస్తున్నారని, తన స్వార్థం కోసం చంద్రబాబు రాజకీయాలను వాడుకుంటున్నారని మాణిక్యాలరావు ఘాటుగా విమర్శించారు.