చెన్నైలో ఆరుగురు క్రికెట్‌ బూకీలు అరెస్ట్‌

చెన్నై, జనంసాక్షి: ఐపీఎల్‌ ఫిక్సింగ్‌ తరోపణల నేపథ్యంలో చెన్నై పోలీసులు శుక్రవారం ఎనిమిది చోట్ల సోదాలు చేపట్టారు. ఈ సందర్బంగా ఆరుగురు బుకీలను అరెస్ట్‌ చేశారు. అయితే ఫిక్సింగ్‌ ఆరోపణలకు, ఈ దాడులకు సంబంధం లేదని సీబీసీఐడీ అధికారులు తెలిపారు. వీరు కేవలం బెట్టింగ్‌లకు పాల్పడుతున్న సమాచారం అందటంతో దాడులు చేసానట్లు వెల్లడించారు. ట్రిప్లికేన్‌, పురషవాక్కం సహా మరో అయిదు ప్రాంతాల్లో దాడులు జరిపారు.
మరోవైపు ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌లో కొత్త ట్విస్ట్‌. ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేసిన 11 మంది బుకీల్లో ఓ ప్లేయర్‌ కూడా ఉన్నాడు. అతను మరెవరో కాదు……….. గతంలో రాజస్థాన్‌ రాయల్స్‌ టీమ్‌కు ఆడిన పేస్‌ బౌలర్‌ అమిత్‌సింగ్‌. 2009 నుంచి 2012 వరకూ అమిత్‌ రాయల్స్‌ టీమ్‌తో ఉన్నాడు.
ఐదు రోజుల ముందే ఢిల్లీ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారంలో అమిత్‌ సింగే కీలకపాత్ర పోషించినట్లు పోలీసులు చెప్పారు. స్పాట్‌ ఫిక్సింగ్‌ కోసం ఆటగాళ్లను ఎంపిక చేసింది కూడా అతనే కావడం విశేషం. అహ్మదాబాద్‌లో పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేశారు. గతంలో బౌలింగ్‌ యాక్షన్‌ సరిగా లేదని అమిత్‌ సింగ్‌ వార్తల్లో నిలిచాడు.