చెన్నై సూపర్ కింగ్స్ 209 పరుగులు..
చెన్నై : ఐపీఎల్ 8లో భాగంగా హైదరాబాద్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 209 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ మెక్ కల్లమ్ విజృంభించి ఆడాడు. వంద పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. టాస్ గెలిచిన చెన్నై బ్యాటింగ్ ఎంచుకుంది. స్మిత్, మెక్ కల్లమ్ హైదరాబాద్ బౌర్లను సమర్థవంతంగా ఎదుర్కొని మొదటి వికెట్ కు 75 పరుగులు చేశారు. వ్యక్తిగత స్కోరు 25 పరుగుల వద్ద ఉన్నప్పుడు స్మిత్ రనౌట్ అయ్యాడు. తరువాత మెక్ కల్లమ్ కు రైనా జత కలిశాడు. ఈ దశలో మెక్ కల్లమ్ విజృంభించి ఆడాడు. జట్టు స్కోరు 135 పరుగుల వద్ద రైనా (14) రనౌట్ అయ్యాడు. అనంతరం వచ్చిన ధోని బ్యాట్ జులిపించాడు. కేవలం 29 బంతులను ఎదుర్కొన్న ధోని (53) పరుగులు చేసి పెవిలియన్ దారి పట్టాడు. మెక్ కల్లమ్ 56 బంతులను ఎదుర్కొని 100 పరుగులు చేశాడు. జడేజా పరుగులు ఏమి చేయకుండానే వెనుదిరిగాడు. హైదరాబాద్ బౌలర్లలో బౌల్ట్ ఒక వికెట్ తీశాడు.