చెరుకు బకాయిలు ఇప్పించమన్నందుకు అరెస్టు చేశారు
కరీంనగర్,ఆగస్టు 30: చెరకు బకాయిలు ఇప్పించాలంటూ ఎమ్మెల్యే విద్యాసాగర్‌ను నిలదీసిన రైతును పోలీసులు అరెస్టు చేశారు. కోరుట్ల మండలం పడిమడుగులో నిన్నటి రోజున చెరకు బకాయిలు ఇప్పించాలని ఓ రైతు, విద్యాసాగర్‌ను నిలదీశాడు. దానికి ఎమ్మెల్యే కూడా స్పందించి వీలైనంత త్వరగా మీకు బకాయిలు అందేలా చూస్తానని ఆయన హామి ఇచ్చారు. కాని ఈ ఘటనను దృష్ఠిలో ఉంచుకున్న పోలీసులు ఆ రైతును అర్థరాత్రి అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.