చెరువును తలపిస్తోన్న ఆకునూరు అంగడి బజారు

రోడ్లు “వేశారు” మట్టి పోయడం “మరిచారు”
అధికారులు, ప్రజాప్రతినిధుల తీరుపై ప్రజలు ఆగ్రహం
చేర్యాల (జనంసాక్షి) జూన్ 18 : అధికారుల నిర్లక్ష్యమో, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్య కానీ ఆకునూర్ అంగడి బజారు ప్రాంతం కొద్దిపాటి వర్షానికే చెరువు కుంటలను తలపిస్తున్నాయి.  రోడ్లకు ఇరుపక్కల డ్రైనేజి కాలువ లేకపోవడంతో ఇటీవల కురిసిన కొద్ది పాటి వర్షానికే చెరువును తలపిస్తుంది. మేజర్ గ్రామపంచాయతీ కావడంతో వందలాది మంది ప్రజలు అంగడి బజారు మీదుగా పరిసర ప్రాంతాలకు నిత్యం ప్రయాణం చేస్తుంటారు. నూతన రోడ్డు నిర్మాణానికి 3కోట్లా 30లక్షలు మంజూరు కాగా ఇటీవల ఊరు అంగడి బజారు నుండి ఎస్సీ కాలనీ వరకూ రోడ్డు నిర్మాణం పూర్తి చేపట్టారు. ఇరువైపులా మట్టి పోయకపోవడంతో కొద్దీ పాటి వర్షానికే జలమయమై చెరువును తలపిస్తుంది. రోడ్లపై చేరిన వర్షపు నీరు ఎటు బయటకు పోయే మార్గం లేకపోవడంతో రోజుల తరబడి రోడ్ల ఇరువైపుల నిల్వ ఉన్నాయి. దీంతో ఆ నీరు రంగు మారి తీవ్ర వాసన రావడంతో పాటు దోమలు సైతం స్వైరవిహారం చేస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా, చర్మ వ్యాధులు, అంటువ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రోడ్డు ఇరుపక్కల డ్రైనేజీ మురికి కాలువ నిర్మాణం చేపట్టి నీటిని బయటకు పంపేందుకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఇలాంటి దుస్థితి నెలకొంది. అధికారులు, ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని, వారి పనితీరు పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు వేడుకుంటున్నారు.

తాజావార్తలు