చేనేత రాష్ట్ర కమిటీ కార్యదర్శి గా కోట మహేందర్ ఎన్నిక
పెద్దఅడిషర్లపల్లి ఆగస్టు25 (జనంసాక్షి):జాతీయ చేనేత ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఎన్నికను అధ్యక్షులు రాపోలు వీర మోహన్ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. పిఏపల్లి మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన కోట మహేందర్ ను ఎన్నుకోవడం జరిగింది.ఈరోజు కార్యక్రమంలో ఆయన మాట్లాతు నాపై ఎంతో నమ్మకంతో రాష్ట్ర కమిటీ కార్యదర్శి పదవిని అప్పగించినందుకు చేనేత సంక్షేమం కోసం కృషి చేస్తూ, నిరంతరం సంఘం కోసం అలుపెరుగనిపోరాటం చేస్తానని,చేనేత సమస్యలు ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్లి సమస్యల పరిస్కారానికి కృషి చేస్తానని కోట మహేందర్ తెలిపారు.నన్ను కమిటీ కార్యదర్శి గా నియమించిన రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీరమోహన్, కటకం వెంకటేశం,మరియు బింగీ బాలరాజుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు అయన అన్నారు.




