చేనేత ర్యాలీ ని ప్రారంభించిన చీఫ్ విప్ గొంగడి సునీత మహేందర్ రెడ్డి

యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాయగిరి కమాన్ నుండి జిల్లా కలెక్టర్ కార్యలయం వరకు చేనేత ర్యాలీని ఆలేరు శాసన సభ్యులు,  ప్రభుత్వ విప్ శ్రీమతి   గొంగిడి సునీత మహేంధర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.1905 వ సంవత్సరంలో బెంగాల్  విభజన విదేశీ వస్తు బహిష్కరణ స్వదేశీ వస్తు వినియోగం అనే నినాదంను పురస్కరించుకొని స్వతంత్ర భారతదేశంలో చేనేత కార్మికుల జీవన స్తితిగతుల అభివృద్ది పరుచుకొనుటకు చేనేత మగ్గానికి దేశ వ్యాప్త ఆదరణ కలిగించుటకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత దినోత్సవాని ఘనంగా జరుపుకుంటామన్నారు.అనంతరం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జాతీయ చేనేత దినోత్సవo  సందర్భంగా చేనేత కార్మికులకు సన్మానం, సబ్సిడీ చెక్కుల బహుకరణ కార్యక్రమానికి ఆలేరు శాసన  సభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీమతి గొంగిడి సునీత మహేంధర్ రెడ్డి , జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, ఎంపీపీ , జడ్పీటీసీ  , జ్యోతి ప్రజ్వలన చేసి ప్రతిజ్ఞ తో కారక్రమాని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆలేరు శాసన  సభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీమతి గొంగిడి సునీత మహేంధర్ రెడ్డి మాట్లాడుతూ చేనేత దినోత్సవం సంధర్భంగా కార్మికులకు(కళాకారులకు) శుభాకాంక్షలు తెలుపుతూ  జీవన ప్రమాణాలు మెరుగుపర్చుటకు అభివృద్ది మరియు సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుంది. పావలా వడ్డీ కింద సబ్సిడీ పథకం కింద జిల్లాలోని (16) ప్రాధమిక చేనేత సహకార సంఘాలకు రూ.110.41 లక్షలు విడుదల  చేయనైనది.  రాష్ట్ర ప్రభుత్వం చేనేత పొదుపు పథకం-2021 (నేతన్నకు చేయూత) క్రింద కార్మికులు నమోదు చేసుకోగా వారికి రాష్ట్ర ప్రభుత్వం మాచింగ్ గ్రాంట్ క్రింద  పొదుపు ఖాతాలలో జమ చేయడం జరిగింది.  చేనేత కార్మికులకు అన్నీ విధాలుగా సహాయసహకారాలు అందిస్తామని , ప్రభుత్వం నుండి వచ్చే  బీమా  పాలసీ కూడా ఉచ్చితంగా అర్హులైన చేనేత కార్మికుల పేరు మీద ప్రభుత్వం పాలసీ చేయడం జరుగుతుంది.
జిల్లా కలెక్టర్  పమేలా సత్పతి మాట్లాడుతూ జాతీయ చేనేత  దినోత్సవం సందర్భంగా చెంత కార్మికులకు శుభాకాంక్షలు తెలుపుతూ  చేనేత వస్త్రాల కళానైపుణ్యానికి సాంస్కృతిక వారసత్వ  సంపదకు ప్రోత్సహిస్తామని వారి అభివృద్ది తోడ్పాటుగా ఉంటామని ఆమె అన్నారు.
అనంతరం చేనేత కార్మికులకు (కళాకారులకు) సబ్సిడీ డెమో చెక్ లను  అందజేసి వారి  చేసే వృత్తిని పరిశీలించి  జిల్లాలోని పేరెన్నికగన్న పోచంపల్లి చేనేత  వస్త్రాలపై జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో పాఠశాల విధ్యార్ధులకు వకృత్వ మరియు వ్యాసరచన పోటీలో విజేతలుగా నిలిచిన 12 మంది విధ్యార్ధులకు బహుమతుల ప్రధానం చేయడం జరిగింది. 8 మంది చేనేత కళాకారులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, మున్సిపల్ ఛైర్మన్ ఆంజనేయులు, వైస్ ఛైర్మన్, ఎంపీపీ , జడ్పీటీసీ  , జిల్లా చేనేత మరియు జౌళి శాఖ సహాయ సంచాలకులు యం.వెంకటేశం, అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు జిల్లాలోని చేనేత కళాకారులు, చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు.