చేపల చెరువులో సున్నం వాడకం లాభాలు గురుంచి వివరిస్తున్న సీనియర్ శాస్త్రవేత్త బి. లవకుమార్
గరిడేపల్లి, ఆగస్టు 5 (జనం సాక్షి):
చేపల పెంపకం చేస్తున్న రైతులు సున్నాన్ని వాడడం ద్వారా అనేక లాభాలు ఉంటాయని కేవీకే సీనియర్ శాస్త్రవేత్త ప్రోగ్రాం కోఆర్డినేటర్ బి. లవకుమార్ అన్నారు. శుక్ర వారం కేవీకే గడ్డిపల్లి లో షెడ్యూల్డ్ కులాలకు చెందిన ఔస్థాహిక యువత కు జాతీయ మస్థ్య అభివృద్ధి మండలి ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం వారి ఆర్థిక సహకారం సెంటర్ ఫర్ ఇన్నో్వేషన్స్ ఇన్ పబ్లిక్ సిస్టమ్ హైదరాబాద్ వారి సంయుక్త సహకారంతో నిర్వహిస్తున్న 15 రోజుల శిక్షణ లో భాగంగా చేపల చెరువు ల్లో సున్నం వాడకం దానివల్ల కలిగే లాభాల గురించి వివరించి నట్లు తెలియజేసారు.చేపల పెంపకంలో నేల ఉదజని సూచిక విలువ ఆధారంగా సున్నం పరిమాణం నిర్ణయించుకొని తప్పనిసరిగా వాడుకోవాలన్నారు .సున్నం అతి చౌకైనా అధిక పరిమాణంలో లభ్యమయ్యే రసాయనమని దీని వాడకం ద్వారా నీటి నాణ్యత పెరుగుతుందని వివరించారు. చేపల చెరువుల్లో కలుపు మొక్కలను తీసివేసిన తర్వాత ఎండబెట్టిన చెరువు మట్టిపైగాని కొంత తడిగా ఉన్న మట్టిపై గాని సున్నాన్ని చెరువు అంతటా వెదజల్లాలని ఎరువులు వేయడానికి పది రోజుల ముందుగానే సున్నం చల్లుకోవాలని తెలియజేసారు.సున్నం వాడకం వలన నీటి ఉదజని సూచిక సరిచేయబడి ప్లాంక్టన్ జాతులు ఎక్కువ రోజులు నిలకడగా పెరుగుతాయని వివరించారు. ఉదజని 6.5 నుండి 7.5 ఉన్న చెరువు ఒక హెక్టారు విస్తీర్ణం కు ఒక సంవత్సరానికి 500-1000 కిలోల వరకు వ్యవసాయ సున్నాన్ని నెల సరి మోతాదు లో విభజించుకొని సూర్యోదయానికి ముందుగాని సాయంత్రం తర్వాత గాని చల్లుకోవాలని దీని వలన నీటి నాణ్యత బాగా పెరిగి అధిక చేపల దిగుబడిని పొందవచ్చునని నీటిలోని ప్రాణవాయువు శాతం పెరిగి వ్యాధులు ప్రభల కుండా ఉంటుందని తెలిపారు.ఈ శిక్షణలో భాగంగా చేపల చెరువులో సున్నం ప్రాక్టికల్ గా చల్లే విధానం చూపించి శిక్షణార్థులకు అవగాహన కల్పించినట్లు తెలియజేసారు.ఈ శిక్షణలో కుర్రి వెంకన్న, సందీప్, వంశీ,నరేష్, నవ్య, నాగేంద్ర, బేబీ, సరస్వతి, రోహిణీ, శ్రావణి, వాణి లతో పాటు 30 మంది విద్యార్థులు పాల్గొన్నారు.