చేప పిల్లల ఉత్పత్తి కార్ప్ హేచరిని సందర్శిస్తున్న యువత వివరిస్తున్న శాస్త్రవేత్తలు

గరిడేపల్లి, ఆగస్టు 6 (జనం సాక్షి): ప్రేరెపిత   ప్రజననం  ద్వారా అవసరమైన  చేప పిల్లల  ఉత్పత్తి తో  చేపల పెంపకం అధికోత్పత్తి ని సాధించగలుగుతున్నామని  పాలేరు మత్స్య పరిశోదన కేంద్రం శాస్త్రవేత్త  బి. రవీందర్ అన్నారు. శనివారం  కేవీకే గడ్డిపల్లి లో షెడ్యూల్డ్ కులాలకు చెందిన ఔస్థాహిక యువత కు  జాతీయ మస్థ్య అభివృద్ధి మండలి ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం వారి ఆర్థిక సహకారంతో సెంటర్ ఫర్ ఇన్నో్వేషన్స్ ఇన్ పబ్లిక్  సిస్టమ్  వారి  సహకారం తో నిర్వహిస్తున్న 15 రోజుల శిక్షణ లో భాగంగా శనివారం చేప  పిల్లల ఉత్పత్తి హాచేరీ యాజమాన్యం పై అవగాహన  కల్పించినట్లు  తెలియజేసారు. కార్ప్ చేపల బ్రీడింగ్  కొరకు బ్రూడర్ చేపలను ఎంపిక చేసుకొని వాటిని ప్రత్యేకంగా పెంచుకోవడం ద్వారా కార్ప్ చేపల అండోత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని అని తెలిపారు.కార్ప్ హాచేరీ చిన్న పాటి రైతులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ  కార్యక్రమంలో భాగంగా  యువతకు  కార్ప్ హాచేరీ  విభాగాన్ని సందర్శించి  ప్రాక్టికల్ గా అవగాహన కలిపించినట్లు  కెవికె  ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ హెడ్ బి. లవకుమార్ తెలియజేశారు. ఈ శిక్షణ లో  వీరాస్వామి, సందీప్, నరేష్, సైదులు, వెంకన్న, సురేందర్, శ్రీను,  వంశీ, నవ్య   ప్ర మీల, ప్రియాంక, బేబీ, మచ్చ రాణి, మౌనిక,తో పాటు 30 మంది పాల్గొన్నారు.