చేర్యాలను తక్షణమే రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలి

ప్రైవేట్ పాఠశాలల సంఘం అధ్యక్షులు రామాంజనేయులు

16వ రోజు దీక్షల్లో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు

రిలే నిరాహార దీక్షలకు మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లేశం గౌడ్ సంఘీభావం

చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 26 : చేర్యాలను వెంటనే రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటన చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రైవేట్ పాఠశాల
సంఘం అధ్యక్షులు తౌట రామాంజనేయులు కోరారు. చేర్యాల రెవెన్యూ డివిజన్ కోసం చేస్తున్న దీక్షలు మంగళవారం 16వ రోజుకు చేరాయి. ఈ దీక్షల్లో చేర్యాల పట్టణ ప్రైవేట్ పాఠశాలల యజమాన్యాలు, ఉపాధ్యాయులు కూర్చున్నారు. జేఏసీ ఉద్యమానికి 2016 రూపాయలు అందజేశారు. ఈ దీక్షలకు చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సుంకరి మల్లేశం గౌడ్ సంఘీభావం తెలిపి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి త్వరలోనే చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయనున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాలల సంఘం అధ్యక్షులు రామాంజనేయులు మాట్లాడుతూ.. నియోజకవర్గంగా తాలూకాగా ఉన్న చేర్యాల ప్రాంతం రోజురోజుకు అస్తిత్వాన్ని కోల్పోయి ముక్కలు చెక్కలుగా విభజించబడి కలిసి ఉన్న చేర్యాలను ఆశాస్త్రీయంగా విడదీయడంతో ఈ ప్రాంత ప్రజలకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. ఘనమైన చరిత్ర కలిగిన చేర్యాలను వెంటనే రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. జేఏసీ నిర్వహించే రెవెన్యూ డివిజన్ ఉద్యమంలో ప్రైవేట్ విద్యాసంస్థల సహకారం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి కర్క మహేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శి రాళ్లబండి కనకాచారి, ఉపాధ్యక్షులు పోతన అనిల్ కుమార్, ప్రవేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు కాపర్తి రాజేశం, మట్ట దేవేందర్ రెడ్డి, ఇర్రి నర్సిరెడ్డి, లక్ష్మణ్, బాలకిషన్, అక్బర్ అలీ, నాగరాజు, నరేష్, రమేష్, వెంకటేష్, రవీందర్ రెడ్డి, ప్రవీణ్, రాజబాబు, అజర్ హుస్సేన్, శ్రీకాంత్, ఫరీద్, శ్యామల, అంబిక, పోతన అనిత, కళావతి, మౌనిక, సమీనా, బూర్గు శ్రీనివాస్, బాలకృష్ణ, వెంకటేష్, తదితరులు దీక్షలో కూర్చోగా వారికి జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగల్ల పరమేశ్వర్, కో చైర్మన్ పూర్మ ఆగంరెడ్డి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్, సిపిఐ(ఎం) మండల కార్యదర్శి కొంగరి వెంకట మావో, టిడిపి పట్టణ అధ్యక్షులు మిట్టపల్లి నారాయణరెడ్డి, జేఏసీ మండల కన్వీనర్ బొమ్మగోని అంజయ్య గౌడ్, చాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు తడక లింగం, జేఏసీ మండల నాయకులు ఈరి భూమయ్య, తాడెం ప్రశాంత్, చంద శ్రీకాంత్, అంబటి అంజయ్య గౌడ్, బండకింది అరుణ్ కుమార్, పోతుగంటి ప్రసాద్, మేరిల్ల శ్రీనివాస్, తాడెం వెంకటస్వామి, బోయిని మల్లేశం, నీలం చింటు తదితరులు సంఘీభావం తెలిపారు.