చేర్యాలలో ఘనంగా బీరప్ప బోనాలు..
చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 22 : శ్రావణమాసం పురస్కరించుకొని చేర్యాల మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం బీరప్ప బోనాల పండుగ అంగరంగ వైభావంగా నిర్వహించారు. కురుమ కులస్తుల కుల దైవమైన బీరప్ప స్వామికి బోనము చేసి నైవేద్యం సమర్పించారు. బీరప్ప దేవాలయం వరకు మహిళలు బోనాలు ఎత్తుకుని కులస్తులు డోలు వాయిద్యాలతో తరలివెళ్లి ఘనంగా జరుపుకున్నారు. పాడి పంటలతో గ్రామ ప్రజలు సంతోషంగా ఉండాలని బీరప్ప బోనాల పండుగ ప్రతీ సంవత్సరం నిర్వహించబడుతుందని కులస్తులు తెలిపారు.