చేల్లో పడుతున్నాయని పశువులపై దురాగతం

గదిలో బంధించడంతో ఊపిరాడక 18 పశువుల మృత్యువాత

రాయ్‌పూర్‌,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి ): తరుచూ పంట పొలాల్లోకి వెళ్తున్న పశువులను రైతులు ఓ గదిలో నిర్బంధించడంతో ఊపిరాడక చనిపోయాయి. ఆ గదిలో నిర్బంధించిన పశువులు ఊపిరాడక మృతి చెందాయి. ఈ విషాద సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బలోద్‌బజార్‌ జిల్లాలో శుక్రవారం చోటు చేసుకోగా.. ఆదివారం వెలుగు చూసింది. రోహషి గ్రామానికి సవిూపంలో ఉన్న పంట పొలాల్లోకి గుర్తు తెలియని పశువులు మేత కోసం వస్తున్నాయి. దీంతో పంట పొలాలను పాడు చేస్తున్నాయని ఆ పశువులను రైతులు గ్రామంలోకి తీసుకువచ్చారు. ఆ తర్వాత గ్రామంలో ఉన్న పశువుల షెడ్డులోని ఓ గదిలో నిర్బంధించారు. వాటికి మేత, నీటి సదుపాయం కల్పించలేదు. మొత్తానికి గదిలో నిర్బంధించడంతో ఊపిరాడక 18

పశువులు మృతి చెందాయి. ఈ పశువుల యజమానులు ఎవరో కూడా తెలియదని గ్రామస్తులు తెలిపారు. అయితే మృతి చెందిన వాటిలో ఆవులు, బర్రెలు ఉన్నట్లు అధికారులు చెప్పారు. మృతి చెందిన జంతువులను గ్రామానికి సవిూపంలో పెద్ద గుంత తవ్వి అందులో పూడ్చిపెట్టారు. ఈ జంతు కళేబరాల వల్ల ఎలాంటి వ్యాధులు సంభవించకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.