చైతన్యరామగిరి మహరాజ్ ఆశ్రమ ఆస్తిని కాపాడాలి.

నేరడిగొండసెప్టెంబర్14(జనంసాక్షి):
మండలంలోని లఖంపూర్ శివరంలోని సర్వే నంబర్ 23/6 లోగల చైతన్య మహారాజ్ ఆశ్రమానికి చెందిన వ్యవసాయ భూమి ఇతరులకు పట్టా కాకుండా కాపాడాలని చైతన్య మహారాజ్ శిష్యులు బుధవారం తహశీల్దార్ పవన్ చంద్రకు వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా మహరాజ్ శిష్యులు తెలిపిన వివరాల ప్రకారం లఖంపూర్ గ్రామ శివారులో సర్వే నంబర్ 23/6 నంబర్ లో విస్తీర్ణం 3.20 గుంటలు గల భూమిలో హనుమాన్ నవగ్రహాల గుడి ఉందని గతంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన  చైతన్య మహారాజ్ భక్తులందరము కలిసి తలకిన్ని విరాళాలు సేకరించి 2004 సంవత్సరంలో పట్టాదారు పేరు గణేశ్ రావు దగ్గర నుండి రూ. 59500.రూపాయలకు కొనుగోలు చేసి  శ్రీ చైతన్య రామగిరి మహరాజ్ పెరుపైన విస్తీర్ణం 3.20 గుంటలు గల వ్యవసాయ భూమిని పట్టా చేయించామని సూచించారు. దానికి శ్రీ శ్రీ శ్రీ చైతన్య రామగిరి మహరాజ్ ఆశ్రమము గాయత్రి నగర్ నామకరణము చేశామని అప్పటి నుంచి వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమలు నిర్వహిస్తున్నామని తద్వారా 2006 సంవత్సరంలో మహారాజ్ అనారోగ్యం కారణంగా మరణించారు. అయినప్పటికీ శిష్యులము దాదాపు50 మంది భక్తులందరము ఆశ్రమంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.ప్రస్తుతం అస్తిపై కకృతి పడి విరాసత్ పట్టా మార్పిడి చేయించుకొనుటకు కొందరు వ్యక్తులు మేము ఆయన వారసులమని రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నట్లు తెలిసింది అందుకు రెవెన్యూ అధికారులు అట్టి ఆశ్రమం ఆస్తిని ఇతరులకు కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు .