చౌటుప్పల్లో ఎమ్మెల్యే నరేందర్ ఎన్నికల ప్రచారం

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 21(జనం సాక్షి)
నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా శుక్రవారం వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ చౌటుప్పల్ లోని 14వ వార్డులో విస్తృతంగా పర్యటించారు ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. అదేవిధంగా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాలుగా సహాయపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆరెల్లి రవి స్థానిక టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.