ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు
ఖమ్మం : చత్తీస్‌గడ్ సరిహద్దు ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం మండలం మారాయిగూడెం వద్ద సీఆర్పీఎఫ్ జవాన్లు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో అశోక్‌జాట్ అనే జవాను మృతి చెందగా.. మరో జవాన్‌కు గాయాలయ్యాయి. హుటాహుటిన జవాన్‌ను భద్రాచలం ప్రభుత్వాస‌్పత్రికి తరలించారు.