ఛలో ఢిల్లీ కరపత్రాన్ని ఆవిష్కరించిన భువనగిరి ఎంపీ

యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో ఒక ప్రైవేట్ కార్యక్రమాలు హాజరైన భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా ఏబిసిడి వర్గీకరణ కర పత్రల ఆవిష్కరించి మాట్లాడుతూ ఈనెల తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపడుతున్న మహా దీక్షలో పాల్గొంటున్న అని ఈ సందర్భంగా అన్నారు. అదేవిధంగా పార్లమెంటరీ లో కూడా ఏబిసిడి వర్గీకరణ కోసం చర్చిస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సుక్క అశోక్ మాదిగ మచ్చ రమేష్ మాదిగ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంజీవరెడ్డి టీపిసిసి ప్రధాన కార్యదర్శి ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బీర్ల ఐలయ్య, ఆత్మకూరు (ఎం) జడ్పిటిసి కుడిత్యాల నరేంద్ర గుప్తా ,యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం, ఆత్మకూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యాస లక్ష్మారెడ్డి ,యాదగిరిగుట్ట మండల పార్టీ అధ్యక్షులు కానుగు బాలాజీ గౌడ్, మోటకొండూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్లముల సంజీవరెడ్డి, పి ఎస్ సి ఎస్ సి చైర్మన్ జిల్లాల శేఖర్ రెడ్డి , ఆత్మకూరు (యం) జన్నాయి కోడి నగేష,తిమ్మాపురం సర్పంచ్ కొమురవెల్లి రామిరెడ్డి, తండా శ్రీశైలం, ఎర్ర విట్టల్ రెడ్డి, రాజు, మదర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు