ఛలో హైదరాబాద్-మిలో నరేంద్ర మోడీ సభ ను జయప్రదం చేయండి.

తొర్రూర్ 24 జూన్ (జనం సాక్షి ) భారతీయ జనతాపార్టీ ( బీజేపి) జాతీయ కార్యవర్గ సమావేశాలు జులై 2,3 తేదీల్లో హైదరాబాద్ లో నిర్వహించడం జరుగుతుంది. ఈ సమావేశాలకు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు,18రా‌ష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, జాతీయ పార్టీ అధ్యక్షుడు నడ్డా , కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మరియు ప్రధాని నరేంద్ర మోడీ  కూడా పాల్గొంటున్నారని,3వ తేది సాయంత్రం భారీ బహిరంగ సభ ను ఏర్పాటు చేశామని ఈసభకు “ఛలో హైదరాబాద్-మిలో నరేంద్ర మోడీ” అని నామకరణం చేశారు అని బీజేపీ రాష్ట్ర, జిల్లా, మండల,శక్తి కేంద్రం ఇంఛార్జి, బూత్ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, శ్రేయోభిలాషులు, విద్యార్థులు,యువత పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని బీజేపీ మానుకోట జిల్లా అధ్యక్షుడు ఒద్దిరాజు రాంచందర్ రావు పిలుపునిచ్చారు. బీజేపీ తొర్రూరు శాఖ అధ్యక్షుడు పల్లె కుమార్ సభాద్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం గతంలో ఇరవై ఏళ్ల క్రింద మన హైదరాబాద్ లో నిర్వహించడం జరిగింది అని,ఈసారి జాతీయ పార్టీ పిలుపు మేరకు మళ్లీ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.తెలంగాణ లో కల్వకుంట్ల కుటుంబ పాలనలో బందీ అయిన తెలంగాణ ప్రజలకు విముక్తిని ప్రసాదించి తెలంగాణ లో కాషాయ జెండా ఎగురవేసి బీజేపీ నేతృత్వంలో పేదల ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం అని దీనికి అనుగుణంగా జాతీయ పార్టీ తెలంగాణ పై ప్రత్యేక ద్రృష్టి సారించింది అని తెలిపారు.జులై3న జాతీయ కార్యవర్గ సమావేశం ముగింపు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ  భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశామని ఈసభకు సుమారు పది లక్షల మంది తో పెద్ద ఎత్తున నిర్వహించి తెలంగాణ లో కనీవినీ ఎరుగని రీతిలో కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు గుండెల్లో నిద్రపోయోలా ఈ సభ ఏర్పాటు చేశామని తెలిపారు.ప్రతీ బూత్ స్థాయి లో ముప్పై మందిని ఎంపిక చేసి ఈ సభకు తరలించడానికి ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.మోఢీ బహిరంగ సభ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటాయని తెలిపారు.కేసిఆర్ ను గద్దె దించేందుకు ఈసారి పక్కా ప్రణాళికతో ముందుకు పోతున్నామని ఈ క్రమంలో బీజేపీ లో చాలా మంది చేరబోతున్నారు అని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకులు నియోజకవర్గ ఇన్చార్జి పెదగాని సోమయ్య, జిల్లా కార్యదర్శి పరుపాటి రాం మోహన్ రెడ్డి, ఎస్సీ మోర్చ మహా బాద్ పార్లమెంట్ ఇంఛార్జి అలిసేరి రవిబాబు, జిల్లా నాయకులు పూసాల శ్రీమాన్,రూరల్ మండలం అధ్యక్షుడు బొచ్చు సురేష్, అర్బన్ ప్రధాన కార్యదర్శి పైండ్ల రాజేష్, గుడిమళ్ళ వెంకటేశ్వర్లు,ఎస్టీ మోర్చ జిల్లా ప్రధానకార్యదర్శి బాలు నాయక్, ఎస్టీ మోర్చ జిల్లా కార్యదర్శి రాయపురంరాజకుమార్, బీజెవైఎం అర్బన్ ప్రధాన కార్యదర్శి నూకల నవీన్,పల్లె సందీప్,కోటి తదితరులు పాల్గొన్నారు.
Attachments area