జండర్‌ ఈక్వాలిటీ ఈ యేడాది థీమ్‌ !

న్యూఢల్లీి,మార్చి7(జనం సాక్షి): యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా ….అన్న ఆర్యోక్తిని మననం చేసుకోవడం నిరంతరంగా సాగాలి. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజలందు కొంటారు. ఎక్కడ స్త్రీలు గౌరవించబడరో అక్కడ ఎంత గొప్ప సత్కార్యాలైననూ ఫలించవు అని మన సంస్కృతి తెలుపుతుంది. ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో, ఎక్కడ స్త్రీలను దేవతగా భావించి పూజి స్తారో, అక్కడ సర్వసంపదలూ ఉండడమేకాక రధ, గజ, తురగ పదాదులతో కూడిన లక్ష్మీ దేవి అచంచలjైు నిలబడుతుంది. 1975వ సంవత్సరం నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి అధికారికంగా నిర్వహించటం ప్రారంభించింది. అంతేకాదు, ప్రతి ఏటా ఏదో ఒక ఇతివృత్తం అంటే థీమ్‌తో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2021 థీమ్‌ జెండర్‌ ఈక్వాలిటీ.. కోవిడ`19 కల్లోలం నుంచి భవిష్యత్తులో అభివృద్ధి చేయడానికి.. విధాన రూపకల్పనకు సంబంధించి నిర్ణయం తీసుకునే పక్రియలో మహిళలను సమాన భాగస్వాములుగా ఎలా చేయవచ్చో థీమ్‌ హైలైట్‌ చేస్తుంది. కరోనా సృష్టించిన ఆర్ధిక కల్లోలం నుంచి భవిష్యత్‌ వైపు అడుగులు వేయాలంటే మహిళలు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. విప్లవాత్మక మార్పుల కోసం అడుగు వేయాలని తెలిపింది. మహిళల పురోగతిని నిరోధించే సాంస్కృతిక, చారిత్రక, సామాజిక`ఆర్థిక అవరోధాల అడ్డును తొలగించాలనేది ఈ థీమ్‌ ముఖ్య ఉద్దేశ్యం.