జగన్‌కు మద్దతుగా పాదయాత్ర
హిందూపురంలో చేపట్టిన వైకాపా
అనంతపురం,సెప్టెంబర్24(జనంసాక్షి): హిందూపురంలో జగన్ ప్రజా సంకల్ప యాత్రకు సంఘీభావంగా నియోజకవర్గ పరిధిలో సోమవారం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూపురం వైసిపి సమన్వయకర్త నవీన్ నిశ్చల్ విలేకరులతో సమావేశమయ్యారు. నవీన్ నిశ్చల్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమం కోసం ప్రజా సంకల్పపాదయాత్ర చేపట్టి 3 వేల కిలోవిూటర్లు చేరుకోవడం హర్షించదగ్గ విషయమన్నారు. 3 వేల కిలోవిూటర్లు చేరుకున్న ప్రజా సంకల్ప పాదయాత్రకు సంఘీభావంగా హిందూపురం నియోజకవర్గంలో మూడు రోజుల పాటు 45 కిలోవిూటర్ల మేరకు పాదయాత్ర చేపట్టి నవరత్నాల పై ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం రాజన్న పరిపాలన తీసుకొచ్చి ప్రజలను అన్ని విధాల ఆదుకోవాలన్నదే జగన్ మోహన్ రెడ్డి ముఖ్య ఉద్దేశమన్నారు. జగన్ ప్రకటించిన నవరత్నాలు ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే విధంగా ఉన్నాయని తెలిపారు. తాము చేపట్టే 3 రోజుల పాదయాత్రలో నవరత్నాల పై ఇంటింటికీ వెళ్ళి క్షుణ్ణంగా వివరిస్తామన్నారు. హిందూపురంలో
వైసిపి పట్ల పోలీసులు పక్షపాతం వహిస్తున్నారని, తమ కార్యక్రమాలకు అనుమతినివ్వకుండా అడ్డుపడుతున్నారని వాపోయారు. పాదయాత్ర, బహిరంగ సభకు అనుమతినివ్వాలని నవీన్ నిశ్చల్ పోలీసులను కోరారు.