జగన్‌కు రిమాండ్ పొడిగించిన సీబీఐ కోర్టు
హైదరాబాద్, జనంసాక్షి: జగన్ అక్రమాస్తులు ,ఓఎంసీ, ఎమ్మార్ కేసు నిందితులను నాంపల్లి సీబీఐ కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. జగన్, శ్రీనివాస్‌రెడ్డి, మోపినేని వెంకటరమణ, నిమ్మగడ్డ ప్రసాద్‌లకు ఈ నెల 29 వరకు కోర్టు రిమాండ్ పొడగించింది.
శ్రీనివాసరెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో వాదనలు పూర్తి అయ్యాయి. తీర్పును మాత్రం కోర్టు ఈ నెల 17 కు వాయిదా వేసింది.