జగన్‌ పాదయాత్ర ఎందుకోసమో: దేవినేని

అమరావతి,మే14(జ‌నంసాక్షి): వైఎస్‌ జగన్‌ ఏ సమస్య కోసం పాదయాత్ర చేస్తున్నారని మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. ప్రాజెక్టనుల పూర్తి చేయవద్దనా, లేక పోలవరం వద్దనా అని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో వెంకయ్యనాయుడు సాక్షిగా, తిరుపతిలో వెంకన్న సాక్షిగా ప్రత్యేక ¬దా ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడిని, టీడీపీని నోటికొచ్చినట్టు తిట్టడాన్ని ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో వారే బుద్ధి చెబుతారని అన్నారు. ప్రత్యేక¬దాపై ప్రజలను ఇంఒకెంతోకాలం మభ్యపెట్టలేరని అన్నారు. మహానాడులో అన్ని పార్టీల రాజకీయాలను కడిగిపారేస్తామని అన్నారు. ఎవరు ఎలాంటి రాజకీయాలు చేస్తున్నారో వెల్లడిస్తామని అన్నారు. రాబోయే వంద మహానాడులకు స్ఫూర్తినిచ్చేలా ఈనెల 27నుంచి కానూరు వీఆర్‌ సిద్దార్థ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో మహానాడు సభలను నిర్వహించనున్నట్టు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, వెస్ట్‌ గోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు మహానాడుకు తరలిరానున్నట్టు తెలిపారు. సీఎం చంద్రబాబు ఏర్పాటు చేసిన 14 కమిటీలతో కలసి పనిచేయడానికి శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. 14 తీర్మానాలపై చర్చ జరుగుతుందన్నారు. కేంద్రంతో పోరాటం చేస్తున్న సమయంలో 18అంశాలపై సాధన స్ఫూర్తిని మహానాడు వేదికగా ప్రస్తావించనున్నట్టు తెలిపారు. ఇతర దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు పండుగ వాతావరణంలో మహానాడు జరుపుకొంటున్నారన్నారు.