జగన్‌ రాజకీయాలు అభివృద్దికి ఆటంకం: పయ్యావుల

అనంతపురం,జూలై20(జ‌నం సాక్షి): ఆంధ్రుల ఆత్మగౌరవానికి భంగం వాటిల్లేలా జగన్‌ వ్యవహారాలు ఉన్నాయని ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌ అన్నారు. నవ్యాంధ్ర అభివృద్ధిలో భాగంగా దేశ, విదేశాల్లో పెట్టుబడుల కోసం, రాజకీయ నేతలతో, కంపెనీల సీఈవోలతో క్షణం తీరిక లేకుండా సీఎం చంద్రబాబు కృషి చేస్తుంటే దానిని అడ్డుకోవడమే లక్ష్యంగా జగన్‌ వ్యవహారం ఉందన్నారు. అమరావతి నిర్మాణం కోసం అంతర్జాతీయ సంస్థలు పోటీ పడుతుంటే దానిని అడ్డుకునేలా జగన్‌ ప్రకటనలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. జగన్‌.. నెలకొక్కసారి రాజధాని ప్రాంతానికి వచ్చి ముఖ్యమంత్రిపై బురదజల్లే కార్యక్రమం చేపడుతున్నారన్నారు. రాజధాని రాకతో తమ భూముల ధరలు ఎంతగానో పెరిగాయని ఆనందంలో ఉన్న రైతులను.. వివిధ రూపాల్లో రెచ్చగొట్టేందుకు జగన్‌ ప్రయత్నించడం దురదృష్టకరమని అన్నారు. జగన్‌ వైఖరి తెలుగు వారికి గౌరవమా అని ప్రశ్నించారు. అభివృద్ధికి పట్టిన చీడ పురుగులా జగన్‌ తయారయ్యా రని ఆయన మండిపడ్డారు. ఏడాదిలోనే ఎన్నికలంటూ ప్రజలను మహ్యపెడుతూ రైతులను రెచ్చగొడుతు

న్నారని అన్నారు. అమరావతిలో 15 కోట్ల రూపాయలు విలువచేసే భూమికి ముష్టి 30 లక్షల రూపాయలు ఇచ్చారని విమర్శించడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శమన్నారు. ప్రతి కుటుంబానికి ఆరోగ్యభద్రత, ఆహారభద్రత, సాంఘిక, సంక్షేమ భద్రత కల్పించిన ఘనత టిడిపిదేనన్నారు. రాష్ట్ర అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి, రూ.5లకే భోజనం అందిస్తున్న ఘనత టిడిపిదన్నారు. రూ.15 చెల్లించి, చంద్రన్న బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని, ఆర్థికంగా ఎదగాలన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి, రైతులు ఆనందంగా ఉండాలని పల్లె ఆకాంక్షించారు. మహిళల్లో ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారిత సాధించాలన్నాదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయమని పేర్కొన్నారు. మహిళా ఆర్థిక సాధికారితలో భాగంగా ప్రతి మహిళకు రూ.10వేలు పెట్టుబడి నిధి పసుపు కుంకుమ కింద పంపిణీ చేస్తామన్నారు. స్థానిక సంస్థలలో భాగస్వామ్యంతో పాటు మహిళలకు ఆస్తిహక్కు, చట్టసభలలో 33శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఎన్టీఆర్‌కు దక్కుతుందన్నారు. సంక్షేమానికి, అభివృద్దికి టిడిపి పెట్టింది పేరన్నారు.

 

తాజావార్తలు