జగన్ వల్లే హోదా సజీవంగా ఉంది
– బాబు తొమ్మిదేళ్ల పాలనలో ఎన్ని ప్రాజెక్టులు కట్టారో చెప్పాలి?
– వైఎస్ హయాంలో చేపట్టిన వాటికి బాబు గేట్లు తెరుస్తున్నాడు
– కాపుల ఉద్యమాన్ని ఉక్కుపాదంతో తొక్కింది చంద్రబాబే
– ఆయన మనుషులే తుని ఘటనకు పాల్పడ్డారు
– వైఎస్సార్‌సీపీ అగ్రనేత భూమన కరుణాకర్ రెడ్డి
తిరుపతి, ఆగస్టు2(జనం సాక్షి) : వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన పోరాటాల వల్లే ప్రత్యేక ¬దా సజీవంగా ఉందని వైఎస్సార్‌సీపీ అగ్రనేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతిలో గురువారం భూమన విలేకరులతో మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం ఊసరవెల్లిలా రోజుకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు తన సభలలో తాను ఏం చేశాడో చెప్పుకోలేక పోతున్నాడని ఎద్దేవా చేశారు. కేవలం వైఎస్ జగన్ విూద ఆరోపణలకే సమయం కేటాయిస్తున్నారని విమర్శించారు. అనంతపురం జిల్లా సభలో వైఎస్ జగన్ విూద దుర్మార్గంగా మాట్లాడుతూ.. వ్యక్తిగత ఆరోపణలు చేశారని మండిపడ్డారు. తొమ్మిది సంవత్సరాలు సీఎంగా ఉన్న చంద్రబాబూ ఎన్ని ప్రాజెక్టులు కట్టావో సమాధానం చెప్పాలి. రాజశేఖర్ రెడ్డి దాదాపు పూర్తి చేసిన ప్రాజెక్టులకు చంద్రబాబు ఇప్పుడు గేట్లు ఎత్తుతున్నారని ధ్వజమెత్తారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ జగన్ వీరోచిత పోరాటం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. బాబు పాలన విూద, వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన విూద చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. దమ్ముంటే చర్చకు సిద్ధపడాలని ఈ సందర్భంగా చంద్రబాబుకు భూమన సవాల్ విసిరారు. సోనియా గాంధీతో కలిసి వైఎస్ జగన్ విూద తప్పుడు కేసులు పెట్టించింది నువ్వు(చంద్రబాబు) కాదా అని సూటిగా అడిగారు. ప్రత్యేక ప్యాకేజీని చంద్రబాబు తిరుమల ప్రసాదంలా భావించాడని పేర్కొన్నారు.
చంద్రబాబు ఆదేశాలతోనే తుని ఘటన..
తుని ఘటనలో రైలు దగ్ధంచేసింది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాదా? అని ప్రశ్నించారని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు అదేశాలతోనే తెలుగుదేశం నేతలే రత్నచల్ ఎక్స్‌ప్రెస్‌ను కాల్చివేశారని ఆయన ఆరోపించారు. తుని ఘటన కేసులను వేగవంతం చేస్తే టీడీపీ నేతలే జైలుకు వెళతారని భూమన అన్నారు. అందుకే ఆ కేసును చంద్రబాబు పక్కనబెట్టారని చంద్రబాబు కాపు ఉద్యమాన్ని అనిచివేయడంలో భాగంగానే తుని ఘటనతో విధ్వంసం సృష్టించి… ఆ నెపాన్ని ముద్రగడకు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు అట్టగట్టారని విమర్శించారు. కాపులంతా బాబు కుట్రలను గమనిస్తున్నారని, తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.