జగన్ స్పందించకపోతే.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం
– స్పష్టం చేసిన వంగవీటి రాధా అనుచరులు
– గంటపాటు అనుచరులతో భేటీ అయిన వంగవీటి రాధా
విజయవాడ, సెప్టెంబర్18(జనంసాక్షి) : విజయవాడ సెంట్రల్ సీటు వ్యవహారంపై వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వంగవీటి రాధా అనుచరులు స్పష్టం చేశారు. మంగళవారం మధ్యాహ్నం రంగా, రాధా మిత్రమండలి సమావేశమైంది. ఈ సమావేశానికి పలువురు స్థానిక నేతలు, పెద్ద సంఖ్యలో మిత్రమండలి సభ్యులు హాజరయ్యారు. సందర్భంగా పలువురు రాధా అనుచరులు మాట్లాడుతూ.. జగన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాధాకు అన్యాయం చేస్తే జగన్‌కు తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. జగన్ డబ్బుకు అమ్ముడు పోయి రాధాకు ద్రోహం చేస్తున్నారని కార్యకర్తలు ఆరోపించారు. రెండురోజులుగా ఆందోళనలు జరుగుతున్నా జగన్ స్పందించకపోవడం నియంతృత్వ పోకడలకు నిదర్శనమని విమర్శలు గుప్పించారు. రాధాకు సీటివ్వకపోతే వైసీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని రాధా అనుచరులు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై రాధా తన అనుచరులతో సుధీర్ఘ సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. ప్రస్తుతం మనం వైసీపీలోనే ఉన్నామని, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ఓసారి జగన్‌ను సంప్రదించి అటునుంచి ఎలాంటి హావిూరాకుంటే భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుందామని రాధాకు అనుచరులు సూచించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే వైసీపీ జిల్లాకు చెందిన నేతలెవ్వరూ రాధా పార్టీపై అసంతృప్తితో ఉన్నా సంప్రదించక పోవటం పట్ల పలువురు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇలాంటిప ఆర్టీలో ఉండి మనం ఏవిూ చేయలేని, ఏ పార్టీలో అయితే తమకు సముచిత స్థానం ఉంటుందో అటువైపుగా దృష్టిసారించాలని సూచించినట్లు పలువురు కార్యకర్తలకు రాధాకు సూచించినట్లు సమాచారం. ఇలా మొత్తానికి ఓ సారి జగన్ దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లి చూద్దామని అటు నుంచి ఏ స్పందన రాకపోతే తరువాత భవిష్యత్ కార్యాచరణపై మాట్లాడదామని రాధా, అతని అనుచరులు ఓనిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. కాగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జిగా మల్లాది విష్ణును నియమిస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయిచండంతో అసంతృప్తి వ్యక్తం చేసిన రధా
ఆదివారం జరిగిన వైసీపీ సమావేశం నుంచి అర్థంతరంగా బయటకు వచ్చారు. అంతేకాకుండా రాధాకు వ్యతిరేకంగ నిర్ణయం తీసుకోవడాన్ని నిరసిస్తూ రాధా బంధువు, వైసీపీ నేత శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో ఒక్కసారిగా వైసీపీ కలకలం మొదలైంది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు రాధా ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. భారీ సంఖ్యలో రాధా ఇంటికి వచ్చిన అనుచరులు వైసీపీ ప్లెక్సీలను తొలగించి వేశారు. దీనికితోడు పలువురు కార్యకర్తలు కిరోసిన్ పోసుకొనే ప్రయత్నం చేయడంతో రాధా వారిని గమనించి వారింపజేశారు. దీంతో మంగళవారం సమావేశమై భవిష్యత్ కార్యాచరణ తీసుకుందామని నిర్ణయించడంతో మంగళవారం భేటీ అయ్యారు.