జనం నుండి అరణ్యంలోకి కోతులు
తూప్రాన్ (జనంసాక్షి) జూన్ 27 :: తూప్రాన్ మున్సిపల్ పరిధిలో ఇటీవల కోతుల బెడద తీవ్రంగా ఉండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు అనే విషయాన్ని మున్సిపల్ అధికారులకు మరియు మున్సిపల్ చైర్మన్ కు ఫిర్యాదు లు రావడంతో చైర్మన్ రాఘవేంద్ర గౌడ్, కోతుల నివారణకు చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ కు చెప్పడంతో ఆయన వెంటనే కోతుల నివారణ చర్యలు చేపట్టారు తూప్రాన్ మున్సిపల్ పరిధిలో కోతులు తమ ఇండ్లలోకి వచ్చి ఇండ్లను మరియు పరిసరాలను వస్తువుల్ని చిందరవందర చేయడంతోపాటు పిల్లలను పెద్దలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయని చైర్మన్ కు క మిషనర్ కు విజ్ఞప్తి చేయగా మున్సిపల్ చైర్మన్ గారి ప్రత్యేక చొరవతో కోతులను పట్టే వారిని తీసుకువచ్చి కోతులను పట్టి జాగ్రత్తగా వాటిని దూరంగా గ్రామానికి మళ్లీ రాకుండా అడవిలో విడచి పెట్టడం విడిచిపెట్టారు. మున్సిపల్ పరిధిలో ఇంకా ఎక్కడైనా కోతులు సంచరిచ్చినట్టైతే మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయగలరు