జనవరి నాటికి.
మంగళగిరి ఎయిమ్స్ సిద్ధం
– ఏపీ ప్రజలకు కేంద్రం ఇస్తున్న కానుక ఎయిమ్స్
– ఆగస్ట్ లో విద్యార్థులకు తరగతులు ప్రారంభిస్తాం
– ఏయిమ్స్ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిసహకారం అందిస్తోంది
– కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా
– నిర్మాణ పనులు పరిశీలించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా
అమరావతి, జులై13(జనం సాక్షి) : వచ్చే జనవరి నాటికి మంగళగిరి ఎయిమ్స్ లో ఓపీ సేవలను ప్రారంభిస్తామని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఆంధప్రదేశ్ రాష్టాన్రికి ఎయిమ్స్ ఓ విశిష్టమైన బహుమతిగా మిగులుతుందని చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్మాణంలో ఉన్న ఎయిమ్స్ భవనాలను కేంద్రమంత్రి నడ్డా శుక్రవారం పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి నక్కా ఆనందబాబు, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి పూనం మాలకొండయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా భవనాల పరిశీలనకు ముందు మంత్రి.. ఎయిమ్స్, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సవిూక్ష నిర్వహించారు.ఆ తర్వాత ఆయన విూడియాతో మాట్లాడుతూ.. అన్ని రాష్టాల్ల్రో ఎయిమ్స్ స్థాయి వైద్య సంస్థ ఉండాలన్న ఉద్దేశంతో కొత్తగా 13 ఎయిమ్స్ లను ప్రారంభించినట్లు చెప్పారు. అన్నింటిలోకి ఆంధప్రదేశ్ ఎయిమ్స్ పెద్ద ప్రాజెక్ట్ అని.. అందుకోసం రూ.1685 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నామని చెప్పారు. ఎయిమ్స్ మొదటి దశ పూర్తి కావడానికి వచ్చే మార్చి వరకు గడువున్నా.. ప్రధాని సూచనలతో జనవరికే సిద్ధం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఎయిమ్స్ వైద్య కళాశాల తరగతులు ఆగస్టులో ప్రారంభమవుతాయని.. ఇప్పటికే అధ్యాపకుల నియామకం మొదలైందని చెప్పారు. ఎయిమ్స్ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని మంత్రి తెలిపారు. ఎయిమ్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం విలువైన 185 ఎకరాల భూమిని అందించిందని.. అన్ని అనుమతులు త్వరితగతిన అందించామని రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ వైద్య శాఖ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ నడ్డా వెంట వచ్చారు. అంతకుముందు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న కేంద్రమంత్రి నడ్డాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, కామినేని శ్రీనివాస్ ఘన స్వాగతం పలికారు.