జనసేన ఆధ్వర్యంలో పాదయాత్ర
రాజోలు,సెప్టెంబర్4(జనం సాక్షి): జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు జనసేన రాజోలు నియోజకవర్గ నాయకులు నాగిరెడ్డి తారక ప్రభు ఆధ్వర్యంలో అంతర్వేది నుండి కాకినాడ వరుకు పాదయాత్ర చేపట్టారు. మంగళవారం మలికిపురం రాజోలు మండలాలలో పాదయాత్ర కొనసాగింది. కోనసీమలో నిత్యం ఒఎన్‌జిసి గ్యాస్ పైప్ లైన్‌ల లీకేజ్‌లు అయ్యి ప్రజలు భయాందోళనకు గురవుతుంటే స్పందించాల్సిన ప్రభుత్వం కాని, ఒఎన్‌జిసి అధికారులు కాని పట్టించుకోకపోవడంతో జనసేన అధినేత పవన్ ఇచ్చిన సూచనల మేరకు ఈ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా తారక ప్రభు మాట్లాడుతూ.. జిల్లాలో ప్రత్యేకంగా కోనసీమ ప్రజలు నిత్యం భయాందోళన తెప్పిస్తున్న ఒఎన్జీసి పైప్ లైన్ లీకేజ్‌లతో ఇబ్బందులు ఎదుర్కుంటున్నా కాని ఒఎన్జీసి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో జనసేన అధినేత సూచనల మేరకు పాదయాత్ర ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు. కాకినాడ వరుకూ పాదయాత్ర చేసి ముగింపులో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ నాయకులు మత్తి జయప్రకాశ్, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధికసంఖ్యలో పాల్గన్నారు.