జనాన్ని దోచుకునేందుకే..

ఆదిలాబాద్‌, నవంబర్‌ 14 : రాష్ట్రంలో ప్రభుత్వ పాలన లేదని, కేవలం ప్రజల సొమ్మును దోచుకునే విధంగా పాలన సాగుతుందని తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆదిలాబాద్‌ ఎంపీ రమేష్‌రాథోడ్‌ ఆరోపించారు. దీపావళి పండగ సందర్భంగా కేరామేరీ మండలంలోని పలు గ్రామాల్లో జరిగిన పండగ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం అధికారంలోకి వస్తే రైతుల పంట రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదని, ప్రభుత్వం రైతులతో పాటు ప్రజాసంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. పత్తి క్వింటాళ్లుకు 6వేల రూపాయలు చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు. జిల్లాలో పంపిణీ చేసిన పంట నష్టం పరిహారంలో అనేక అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు.