జనారణ్యంలోకి చుక్కల దుప్పి
జూలూరుపాడు, ఆగష్టు 17, జనంసాక్షి: అడవిలో సంచరించే చుక్కల దుప్పి జనారణ్యంలోకి వచ్చింది. అడవికి మేతకు వెళ్లిన మేకల గుంపుతో కలిసి మండల కేంద్రమైన జూలూరుపాడు చర్చి కాంపౌండ్ లోకి బుధవారం సాయంత్రం చేరింది. అవరణ విశాలంగా ఉండటంతో పరుగులు పెడుతున్న అందమైన చుక్కల దుప్పిని చూసి పిల్లలు, పెద్దలు సంబరపడ్డాడు. పిల్లలు కొందరు వీడియోలు తీసేందుకు ఉత్సాహం చూపారు. ఆ తర్వాత జూలూరుపాడు కోయ కాలనీ వైపు పరుగు తీసింది. సమాచారం తెలుసుకున్న అటవీ రేంజ్ అధికారి ప్రసాదరావు సిబ్బందితో దుప్పిని సంరక్షించేందుకు తక్షణ చర్యలు చేపట్టారు. కొందరు యువకులు సహాయంతో అటవీశాఖ దుప్పిని పట్టుకుని అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. చిన్న చిన్న గాయాలు కావడంతో పశు సంవర్ధకశాఖ వైద్యులతో దుప్పికి చికిత్స చేయించారు. ఈ సందర్భంగా రేంజ్ అధికారి ప్రసాదరావు మాట్లాడుతూ చుక్కల దుప్పికి సుమారు రెండేళ్ల వయస్సు ఉంటుందని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కిన్నెరసాని వన్యప్రాణి సంరక్షణ కార్యాలయం లేదా అటవీ ప్రాంతంలోకి సురక్షితంగా పంపించటం జరుగుతుందని తెలిపారు. ఆగష్టు 17, జనంసాక్షి: అడవిలో సంచరించే చుక్కల దుప్పి జనారణ్యంలోకి వచ్చింది. అడవికి మేతకు వెళ్లిన మేకల గుంపుతో కలిసి మండల కేంద్రమైన జూలూరుపాడు చర్చి కాంపౌండ్ లోకి బుధవారం సాయంత్రం చేరింది. అవరణ విశాలంగా ఉండటంతో పరుగులు పెడుతున్న అందమైన చుక్కల దుప్పిని చూసి పిల్లలు, పెద్దలు సంబరపడ్డాడు. పిల్లలు కొందరు వీడియోలు తీసేందుకు ఉత్సాహం చూపారు. ఆ తర్వాత జూలూరుపాడు కోయ కాలనీ వైపు పరుగు తీసింది. సమాచారం తెలుసుకున్న అటవీ రేంజ్ అధికారి ప్రసాదరావు సిబ్బందితో దుప్పిని సంరక్షించేందుకు తక్షణ చర్యలు చేపట్టారు. కొందరు యువకులు సహాయంతో అటవీశాఖ దుప్పిని పట్టుకుని అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. చిన్న చిన్న గాయాలు కావడంతో పశు సంవర్ధకశాఖ వైద్యులతో దుప్పికి చికిత్స చేయించారు. ఈ సందర్భంగా రేంజ్ అధికారి ప్రసాదరావు మాట్లాడుతూ చుక్కల దుప్పికి సుమారు రెండేళ్ల వయస్సు ఉంటుందని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కిన్నెరసాని వన్యప్రాణి సంరక్షణ కార్యాలయం లేదా అటవీ ప్రాంతంలోకి సురక్షితంగా పంపించటం జరుగుతుందని తెలిపారు.