జన విజ్ఞాన వేదిక కృషి అభినందనీయం : ఎమ్మెల్సీ శ్రీనివాసులు రెడ్డి
కడప,ఆగస్టు25(జనం సాక్షి ) : కడప జిల్లా రైల్వేకోడూరు మండలంలోని బయనపల్లె జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శనివారం జన విజ్ఞాన వేదిక శాస్త్రీయ దృక్పథం పక్షోత్సవాలు-సీజనల్ వ్యాధులపై కళాజాత ఐదవ రోజు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సైమన్ ఫ్రాన్సిస్ అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీశ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలన్నారు. విద్యార్థులలో శాస్త్రీయతను పెంపొందించడానికి జన విజ్ఞాన వేదిక వారు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. అనంతరం జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు విశిష్ట అతిథి రాజశేఖర్ రాహుల్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ జనవిజ్ఞాన వేదికలో సభ్యత్వం తీసుకొని శాస్త్రీయ సమాజం కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక మండల అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మి కుమార్, ఎం. సుబ్బయ్య, జెవివి జిల్లా అధ్యక్షులు వెంకట సుబ్బయ్య, ప్రధాన కార్యదర్శి దేవదత్తం కోశాధికారి మహేష్ , రాష్ట్ర రిసోర్స్‌పర్సన్ రంగనాయకులు రంగనాయకులు చెకుముకి, కన్వీనర్ వసంత్, జిల్లా కార్యదర్శి సుబ్బయ్య , కఅష్ణారెడ్డి జిల్లా సమతా కన్వీనర్ సరస్వతి, యూత్ కో కన్వీనర్ ప్రసాద్‌నాయక్, కార్యవర్గ సభ్యులు వెంకటరత్నం, సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్.చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.