జమ్మూకశ్మీర్‌కు గవర్నర్‌గా రాజీవ్‌ మహర్షి?

– వోవ్రాను మార్చే యోచనలో కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ, జులై31(జ‌నం సాక్షి ) : జమ్మూకశ్మీర్‌కు కొత్త గవర్నర్‌ను నియమించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతమున్న గవర్నర్‌ ఎన్‌ఎన్‌ వోహ్రను ఆ పదవి నుంచి తప్పించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఎన్‌ ఎన్‌ వోహ్ర గవర్నర్‌ పదవిలో కొనసాగబట్టి పదేళ్లకు పైగా అవుతుంది. అయితే జమ్మూకశ్మీర్‌కు కొత్త గవర్నర్‌ను ఎంపిక చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. మాజీ ¬ం సెక్రటరీ, కాగ్‌ ప్రస్తుత అధ్యక్షుడు రాజీవ్‌ మహర్షి గవర్నర్‌ బరిలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ(పీడీపీ)తో మూడున్నరేండ్ల పాటు సాగిన పొత్తుకు బీజేపీ గుడ్‌బై చెప్పిన విషయం విదితమే. దీంతో మొహబూబా ముఫ్తీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేనందున కేంద్రపాలన విధించాలని గవర్నర్‌ ఎన్‌ఎన్‌ వోహ్రా సిఫారసు చేశారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఒక నివేదికను పంపారు. నివేదికను పరిశీలించిన రాష్ట్రపతి కోవింద్‌.. జమ్మూకశ్మీర్‌ లో గవర్నర్‌ పాలనకు ఆమోదం తెలిపారు. జూన్‌ 20 నుంచి జమ్మూకశ్మీర్‌ లో గవర్నర్‌ పాలన మొదలైంది.

—————————