జయలలిత ఆరోపణలను ఖండించిన కేంద్రం

న్యూఢిల్లీ : కాంగ్రెసేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాల పట్ల కేంద్రం విచక్షణ చూపుతోందని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చేసిన ఆరోపణలను కేంద్రం ఖండించింది. ప్రధాని తన ప్రసంగం కాగానే జయలలితను ప్రసంగించాల్సిందిగా కోరారని అసలైతే ఆమో వంతు తర్వాతెప్పుడో ఉందని పార్లమెంటరీ వ్యవహరాల సహాయ మంత్రి రాజీవ్‌ శుక్లా పేర్కోన్నారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు , ఆర్ధిక వ్యవసాయ మంత్రులతో పాటు 35 మంది ముఖ్యమంత్రులు మాట్లాడాల్సి ఉన్నందున ఒకోక్కరికి 10 నిమిషాలు మాత్రమే కేటాయించారని ఆయన వివరించారు. పార్టీతో సంబంధం లేకుండా అందరికి సమానంగా అవకాశం ఉంటుందని, అనవసర రాద్ధాంతం చేయకుండా ఎన్టీసీ సమావేశం ద్వారా తమ రాష్ట్రాలకు అవసరమైన లబ్దిని చేకూర్చుకోవడానికి ముఖ్యమంత్రులు ప్రయత్నించాలని ఆయన సూచించారు.