జరిమానాలతో ఎస్‌బిఐ పంటపండింది

కనీస నగదు నిల్వల పేరుతో భారీగా వసూళ్లు

న్యూఢిల్లీ,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి): ఖాతాల్లో కనీస నగదు నిల్వలులేని వినియోగదారులపై ఎస్‌బిఐ దారుణంగా పెనా/-లటీలు వేస్తోంది. గతంలో విమర్శలు వచ్చినా పట్టించుకోని బ్యాంకు తన విదానాలు మార్చుకోలేదు. తాజాగా గత ఆర్థిక సంవత్సరం రూ.5వేల కోట్ల జరిమానాలలను బ్యాంకులు రాబట్టుకున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన ప్రధాన బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వసూలు చేసినవే ఇందులో సగం ఉన్నాయి. లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్‌ ప్రతాప్‌ శుక్లా తెలిపిన వివరాల ప్రకారం దేశంలోని మొత్తం 21 ప్రభుత్వ రంగ బ్యాంకులు, మరో మూడు ప్రముఖ ప్రైవేట్‌ రంగ బ్యాంకులు కలిసి ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన సంవత్సర కాలంలో ఖాతాదారుల నుంచి కనీస నగదు నిల్వలు లేవని 4వేల 989 కోట్ల రూపాయలు జరిమానా కింద వసూలు చేశాయి. ఇందులోఎస్‌బిఐ వసూళ్లే రూ.2వేల 433.87 కోట్లు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం ఎస్‌బిఐకి రూ.6,547 కోట్ల నికర నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో ఇదే ఆర్థిక సంవత్సరం జరిమానాల రూపంలో రూ.2,434 కోట్ల ఆదాయం రావడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నది. నిజానికి కనీస నగదు నిల్వలు లేని ఖాతాదారులపై జరిమానాలు తీవ్రంగా ఉన్నాయని ఇప్పటికే పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. తర్వాత రూ.590.84 కోట్లతో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ ఉన్నది. 2016-17లో రూ. 619.39 కోట్లు వసూలు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. అలాగే యాక్సిస్‌ బ్యాంక్‌ రూ.530.12 కోట్ల వసూలుతో మూడు, రూ.317.6కోట్లతో ఎఅఎఅఎ నాలుగో స్థానంలో, రూ.211 కోట్లతో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఐదో స్థానంలో ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల నష్టం రూ.85వేల 361 కోట్లుగా ఉంది. ఏదిఏమైనా వ్యాపారం, దానిపై లాభాల సంగతెలాఉన్నా.. కనీస

నగదు నిల్వలు లేని ఖాతాదారులపై జరిమానాల రూపంలో చేస్తున్న వసూళ్లు బ్యాంకులకు భలే ఆదాయం తెచ్చిపెడుతున్నాయి.