జర్నలిజం వృత్తిని అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలి
-టియుడబ్ల్యూజే(ఐజేయు) మండల అధ్యక్షుడు పూర్ణచందర్
కురవి సెప్టెంబర్-21 (జనం సాక్షి న్యూస్)
కురవి మేజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి, తన భర్త ఇద్దరు కలిసి జర్నలిస్టులు ఎంత ప్యాకేజీలు తీసుకొని వార్తలు రాస్తున్నారని జర్నలిజం వృత్తిని ఆవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలని టియుడబ్ల్యూజే(ఐజేయు) జర్నలిస్ట్ సంఘం
మండల అధ్యక్షులు అనుగోజు పూర్ణచందర్ రావు కోరారు. ఆ సంఘం ఆధ్వర్యంలో బుధవారం కురవి మండల కేంద్రంలోని తహశీల్దార్ ఇమ్మానియేలుకు, ఎంపిడివో కార్యాలయంలో సూపరింటెండెంట్ సులోచన కు, మండల పంచాయతీ అధికారి పద్మకు, గ్రామ పంచాయతీ సర్పంచి నూతక్కి పద్మ నర్సింహారావులకు వినతిపత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పూర్ణ చందర్ రావు మాట్లాడుతూ.. కురవి గ్రామ పంచాయతీ సిబ్బంది ఇటీవల సమస్యలపై చేసిన ఆందోళన విషయంలో సర్పంచి, కార్యదర్శి వివరణ మెరకు వార్తలు ప్రచురించిన జర్నలిస్ట్ బేతమల్ల సహదేవ్ పై ఈ నెల 17 శనివారం, ఉ. గం 11:54 నిమిషాలకు కురవి గ్రామ పంచాయతీ కార్యదర్శి విజయలక్ష్మి విధుల్లో బాగంగా తన భర్త బ్రహ్మం ఇద్దరు కలిసి జర్నలిస్ట్ సహదేవ్ కు ఫోన్ చేసి నీ ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తున్నావాని బెదిరించడం సరికాదన్నారు. ఎంత ప్యాకేజీ తీసుకొని వార్తలు రాస్తున్నావు అంటూ జర్నలిజం వృత్తిని అవమానించారని, జర్నలిస్ట్ ఎవరిదగ్గర ప్యాకేజీ లు తీసుకొని వార్తలు రాస్తున్నారో నిరూపించాలన్నారు. జర్నలిస్ట్ విధులకు ఆటంకాలు కల్పిస్తూ బెదిరింపులకు గురిచేసిన కార్యదర్శి, తన భర్త పై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని, లేనియెడల ఇలాగే కొనసాగుతే జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారులకు పిర్యాదు చేసి జర్నలిస్ట్ ల యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా టియుడబ్ల్యూజే(ఐజేయు) జర్నలిస్ట్ జిల్లా నాయకులు బేతమల్ల సహదేవ్, మండల నాయకులు సంతోష్, అమెడ నాగరాజు, పరిషబోయిన మహేష్, గండమాల రోశయ్య, యువరాజ్, తదితరులు పాల్గొన్నారు.