జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి.

కనీస పరిజ్ఞానం లేని,వారికే జర్నలిస్టు యూనియాన్ల పదవులు.
నేషనల్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడు మంగళపల్లి హుస్సేన్.
తొర్రూరు 2 జూలై (జనంసాక్షి ).
మహబూబాబాద్ జిల్లాలోని గత కొద్ది సంవత్సరాల నుంచి జర్నలిస్టుల వృత్తిని నమ్ముకోని,ప్రింట్&ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న పత్రిక సోదరులకు అక్రిడేషన్ కార్డులు పంపిణీ చేయాలని,నేషనల్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడు మంగళపల్లి హుస్సేన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంగళపల్లి హుస్సేన్ మాట్లాడుతూ.మన జిల్లాలో మంత్రులు,ఎమ్మెల్యే,ఎంపీ,జిల్లా కలెక్టర్లు ఉన్నప్పటికీ కూడా జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వకపోవడం చాలా బాధాకరమని,ఎలాంటి జీతాలు లేకుండా.అక్షరాన్ని ఆయుధంగా మార్చుకోని,ప్రజలకు,ప్రభుత్వ అధికారులకు,రాజకీయ నాయకులకు మధ్య వారధిగా ఉంటూ.సమాచారాన్ని సేకరిస్తున్న జర్నలిస్టులను గుర్తించి,అక్రిడేషన్ కార్డులు అందజేయాలని,లేని యెడల అక్రిడేషన్ కార్డులు ఇచ్చేవరకు పోరాటం ఆపబోవని హెచ్చరించారు.