జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని కలెక్టర్ కు వినతిపత్రం

గద్వాల నడిగడ్డ, ఫిబ్రవరి 3 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల: జిల్లాలో వర్కింగ్ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ తో వివిధ జర్నలిస్ట్ యూనియన్ల ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ వల్లూరు క్రాంతి కి వినతి పత్రం సమర్పించారు. సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ వీలైన త్వరలో సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.